సుప్రభాత కవిత ; ; బృంద
బ్రహ్మాది దేవతలు
కార్యములు సాధింప
ఎవరిని ప్రార్థిస్తారో
ఆ గజాననునికి 
వందనం🙏

సంకల్పము నెరవేర్చడానికి
తగిన బలము... బుధ్ధిఇచ్చి 
కార్య సిధ్ధి కలిగించు
వినాయకునికి 
వందనం🙏

పత్రి గరికతో పూజ చేయగా
పచ్చని బ్రతుకిచ్చు
ప్రధమ దైవానికి
వందనం 🙏

ఐశ్వర్యం ....దానిని అనుభవించు
అధికారం ప్రసాదించు
లక్ష్మీ గణపతికి 
వందనం 🙏

బలానికి అధిపతి అయి
బలం ప్రసాదించు 
భగవంతుడికి 
వందనం 🙏

శివ శక్తుల ఏకరూపమైన
ఓంకార రూపమే తానైన
ఏకదంతునికి 
వందనం🙏

విరించికి జ్యోతిరూపంలో
దర్శనమిచ్చిన
వక్రతుండునికి
వందనం 🙏

వేదవ్యాసుడికి గురువై
జ్ఞాన స్వరూపుడై
సకలవిద్యలనూ ప్రసాదించు
ఏకదంతుడికి
వందనం 🙏

సకలదేవతల  పూజలూ
ప్రార్థనలూ అందుకొని
అనుగ్రహించు
సురాధ్యక్షునికి
వందనం 🙏

విఘ్నాలు తొలగించమనీ
విద్యలు  ప్రసాదించమనీ
విజయాలు వరింపచేయమనీ
విజయగణపతికి
వందనం 🙏

నిజాయితీకి  విలువ
నిజానికి  గౌరవం
అసురులపై గెలుపు
ఆంధ్రులకు క్షేమం
అనవరతమూఇమ్మని
అంతర్యామిని ప్రార్థిస్తూ

శుభాకాంక్షలతో

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు