ఓ మహాకవీ!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గిజిగాడులా
కవితలగూడు అల్లవోయ్

సుమాల్లా
చదువరులపై సుగంధాలుచల్లవోయ్

దీపములా
ధవళకాంతులు చిమ్మవోయ్

చిత్రకారుడిలా
చిత్రవిచిత్రాలు చూపవోయ్

శిల్పకారుడిల
చక్కనిశిల్పాలు చెక్కవోయ్

మేఘాల్లా
వానజల్లులు కురిపించవోయ్

చంద్రునిలా
చల్లనివెన్నెల చిందించవోయ్

ఆహారంలా
ఆకలికడుపులు నింపవోయ్

నీరులా
కవనదాహార్తి తీర్చవోయ్

భావాలతో
పాఠకులమదులు తట్టవోయ్

అల్పాక్షరాలతో
అనల్పార్ధాలు స్ఫురించవోయ్

ఆయస్కాంతంలా
అంతరంగాలను ఆకట్టుకోవోయ్


కామెంట్‌లు
SrinivasaRao Samrajyam చెప్పారు…
చక్కటి కవితలతో పాఠక హృదయాలను
రంజింపచెయవోయి .