.చిత్రానికి కవిత ; -..కోరాడ నరసింహా రావు.
చూస్కోండర్రా... పిల్లలూ 
ఫోటోలో మీరు ఎంత చక్కగా నవ్వుతున్నారో... !
   
బట్టలు లేని... బౌద్ధ దలై లామాల్లా.... !
   తిరుపతి వెంకన్న ప్రియ భక్తుల్లా.... !!

ఎంత చక్కగా నవ్వుతున్నారర్రా.... !
  కోటీశ్వరుల బిడ్డలైనా.. ఇంత 
 ఆనందంగా నవ్వలేరేమో... !

కలిమి - లేములు.... 
   కష్ట - సుఖాలు... 
    మీ బాల్యాన్ని ఎక్కువగా 
     బాధించలేకపోవటం... 
     నిజంగా... మీ బాలల అదృష్టమే నర్రా..... !

మీ మనసులు నిర్మలం 
  మీ బాల్యమె  నిర్మలం 
      మీనవ్వులు, పోజులు... 
     నిష్కల్మషం - నిర్మలం !!
     ****************
..

కామెంట్‌లు