కళ్ళల్లో కన్నీరు కాదు నీరు; - సునీతా ప్రతాప్
పాలమూరు అంటే
పగలగొట్టిన అద్దం!!

పాలమూరు అంటే
కంకరరాళ్ల పర్వతం!!

పాలమూరు అంటే
నోళ్లు తెరిచిన బిల్లు!!

పాలమూరు అంటే
వేగంగా ఆకాశంలోకి వలస వెళ్లిన
తెల్లని మేగం!!

పాలమూరు అంటే
మట్టిని ఇటికలు చేసిన నేల!!

ఆలమూరు అంటే
కట్టెలను కాల్చి బొగ్గులు చేసిన నేల!!

పాలమూరులో వానలు రావు
వాగులు వంకలు లేవు!!

పాలమూరులో పంటలు పండవు
పాలమూరులో చెరువులు కుంటలు నిండవు.

పాలమూరు ప్రజల కడుపులు
ఎప్పటికీ నిండవు.!!

పాలమూరు మోదుగ పూలకు
ఎప్పటికీ వాసన ఉండదు!!

పాలమూరు తంగేడు పూలు
ఎప్పటికీ పూజకు పనికిరావు!!
కానీ ఇప్పుడు

తెలంగాణలో
పాలమూరు పాడిపంటల పాలసముద్రం!!

పచ్చని పైరుల ఆకుపచ్చని రత్నం!!

కుంటలు చెరువులు నిండి వాగులు వంకలు పొంగిపొర్లి పాలమూరు ఏరు ఇప్పుడు!!

పాలమూరు రెండు కళ్ళల్లో కన్నీరు
తాగునీరు సాగునీరు పాలమూరుకు రెండు కళ్ళు ఇప్పుడు.
పాలమూరు కళ్ళల్లో కన్నీరు కాదు నీరు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తరలివస్తున్న కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ.

Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏
9347320878.

కామెంట్‌లు