తెలుగు దోహాలు;- : ఎం. వి.ఉమాదేవి

 30)
నాయక ధోరణి ప్రబలగా, నలిగి పోవు ప్రజలంత!
పెరిగిన ఆశల వల్లనే, దేశ భద్రతే కంత!
31)
కోరిక తీరిన సమయమే , కొత్త ఆశలోనెనరు
మారదు స్వభావ మింకనూ, సేవచేయగావినరు! 
32)
పోయే కాలము వచ్చినా, జీవితాశయేమందు !
రాలిన ఆకులు ఎరువుగా, మారుచుండు తరువందు!
33)
తలుపులు మూసిన క్షణమునే, తలపులేవొ      క్రమ్ముకొను
మేలగు ఆలోచనములే, మేటిగాను నిల్పుకొను!
34)
నవ్వుల పువ్వుల కుప్పలే, ఏర లేను చెలియ అవి
మిగిలేనశ్రువు కణములే, ఇంకిపోవులే అవి!
35)
భానుని తేజము అలరెనే, కావ్యావేశమే పొంగి
శశిశీతలమే పోలెనే అక్ష రాలు,కవి పొంగి !
36)
ఎగిరే బుల్బులు పిట్టగా, వెళ్లిపోతివేమొ సఖి 
ఖర్జుర తీపివి నీవయీ, అందరావె చంద్రసఖి!
37)
అద్భుత గజళ్ళ వేదికే, ఆమెరాక వేడుకల?
వెలవెలబోయిన షాయరా వేసినారుగా మాల !
38)
కత్తెర వేసిన నిశలవీ, కలలు తొల్చివేసినవి
చెలియే రాదని గాలులే చెట్లలోన దాగినవి !
39)
దీపం వెలుగును అడుగుతా, దివ్య కాంతినిమ్మనుచు
వాకిట గంధము అలముతా, రేయినిల్చి పొమ్మనుచు!
40)
కాలము కరగని చోటులో , కంటనీరు ఆగదుగ
పదిలము లేనిది శ్రామికా, పంతమేమి నిల్వదుగ!!
41)
మాటల తేనెల ఊటలో, మోసపోతు ఉండకుమ
నీటిని పాలను హంసగా, వేరుచేసిచూడు సుమ!
42)
శాశ్వత మేదీ సృష్టిలో, ఐన ఏదొఆశ కద !
జీవిత కాలం లోపలే, కీర్తి పొందమేలు కద!
కామెంట్‌లు