శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 యోగి అంటే అర్థం యోగ సాధన చేసేవాడుఅని.యోగాశ్చితవృత్తినిరోధః అంటే చిత్తాన్ని సంపూర్ణ వృత్తుల్తోనిరోధించటమే యోగం.చిత్తవృత్తి నిరోధక ద్రష్ట ఆత్మ స్వరూపం కి కారకుడు.యోగ అంటే సమాధి అని భాష్యకారుల మాట.పతంజలి చాలా వివరంగా యోగసూత్రంలో రాశాడు.దీన్నే సాంఖ్య దర్శనము అన్నారు.సాంఖ్యదర్శన ప్రవర్తకుడు కపిలమహర్షి.పతంజలి ఆయనవే గ్రహించాడు.4భాగాల్లో(పాదాలు) విభజన చేశాడు.సమాధిపాద విభూతిపాద సాధనపాద‌ కైవల్య పాద అని నాలుగు భేదాలు.పతంజలి అష్టాంగ యోగంని వివరించారు.యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవి.వీటి అభ్యాసం వల్ల అవిద్య అస్మిత రాగద్వేషాలు అభినిర్వేద నాశనం ఔతాయి.
యోగికి ఉన్న ఇంకో అర్థం గొప్ప గారడీ మ్యాజిక్ చేసేవాడు.భారతీయకథా సాహిత్యంలో మంత్రబలంతో చమత్కారాలు చేసిన యోగులు కన్పడ్తారు.వీరు మోసగాళ్ళు.కనఫటే యోగి ఒఃజాతి. బెంగాల్ లో యోగి అనే పేరు గల జాతివారు బట్టలు నేస్తారు.రుద్రుని నుంచి ఉద్భవించారుట.బెంగాల్ యోగులంతా శివోపాసకులు.కృష్ణ ఉపాసకులు వైష్ణవ యోగులు.శక్తి ఉపాసకులు గూడా ఉన్నారు🌹
కామెంట్‌లు