"ఓజోన్ పరిరక్షణ మానవాళి బాధ్యత"

 వాతావరణంలో విడుదలవుతున్న రసాయనాలు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని, ఓజోన్ పొరను బలహీనపర్చే పదార్ధాల తయారీని నియంత్రించేందుకు ప్రభుత్వాలు, మానవులంతా చిత్తశుద్ధితో కృషి చేయాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తూతిక సురేష్ అన్నారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం సందర్భంగా  పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ స్ట్రాటో ఆవరణలో ఉన్న ఓజోన్ పొర భూమిమీదకు వచ్చే అన్ని విశ్వ కిరణాలను అడ్డుకుని భూమిని పరిరక్షిస్తోందని, రసాయన కాలుష్యాల ప్రభావ ఫలితంగా ఓజోన్ పొరకు చిల్లు పడినట్లయితే సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు ప్రసరించి, మానవజాతికి, సమస్తకోటి జీవజాతులకు ప్రమాదకారిగా మారుతాయని అన్నారు. తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్ముంనాయుడు మాట్లాడుతూ వివిధ కాలుష్యాల బారిన పడిన ధరణీ మాత విలపిస్తోందనీ, ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లును పూడ్చడం ద్వారా ప్రతిదేశం ఓజోన్ పరిరక్షణకు, భూమాత పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను అకుంఠిత దీక్షతో పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తూతిక సురేష్, ఉపాధ్యాయులు దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు,  బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
కామెంట్‌లు