.విద్యా కుసుమాలు;- పద్మావతి ‌పి-హైదరాబాద్
రారండోయ్ రారండోయ్
బిరబిర చరచర పరుగుల
ఉల్లాసంగా ఉత్సాహంగా
బడి వొడిలో చేరండోయ్!

ఆటల పాటల వేడుకగా
ఆ ఆ అచ్చులు నేర్చేద్దాం
తీయగా హాయిగా నేర్పుగా
కమ్మని తెలుగును చదివేద్దాం!

గురువుని భక్తితో కొలిచేద్దాం
శ్రద్ధాసక్తులు చూపెడదాం
క్రమశిక్షణతో మెలిగేద్దాం
కలిసీ మెలిసీ స్నేహం మనమందరం!

బేధాలను తుంచేద్దాం
తేడాలను మరిచేద్దాం
నీవూ నేనూ మనమంటూ
ప్రగతి బాటలో అడుగులు వేద్దాం!

విజ్ఞానానికి వారసులం
అజ్ఞానాన్ని తరిమేద్దాం
పదపదమంటూ ముందుకు
మున్ముందుకు అడుగులు వేద్దాం!

భరతావని కలలను నిజం చేద్దాం
శ్రమ సాధనలే  సాధ్యంగా
ఆశయ లక్ష్యమె ధ్యేయంగా 
విజయాలను సాధిద్దాం
కీర్తి పతాకను ఎగరేద్దాం!

*********


కామెంట్‌లు