తానా ప్రపంచ సాహిత్య వేదిక కాళోజి నారాయణరావు జయంతి,కి డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మికి ఆహ్వానం
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక   కాళోజి నారాయణరావు జయంతి,
తెలంగాణ భాషా దినోత్సవం
సందర్భంగా సెప్టెంబర్ 9 నాడు  నిర్వహిస్తున్న  అంతర్జాతీయ కవి సమ్మేళనానికి హైదరాబాద్ హస్తినాపురం సెంట్రల్ కు చెందిన విశ్రాంత సహాయ ఆచార్యులు డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులుగా   ఎంపికయ్యారు.  వీరు "తెలుగులో లేఖా సాహిత్యం" అనే  అంశంపై  P.hD., చేశారు. 32 ఏళ్లు ప్రభుత్వ తెలుగు అధ్యాపకురాలిగా  పనిచేసి, అలాగే NSS ప్రోగ్రాం ఆఫీసర్ గా సేవలందించి రాష్ట్ర ప్రభుత్వ బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ గా  అవార్డ్ అందుకుని, గత  35 సంవత్సరాలుగా  తన రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న డా.సీతాలక్ష్మి దర్పణం సాహిత్య వేదిక మరియు మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పలు సామాజిక అంశాలపై ఎన్నో వేల  కవితలు రాసి వర్ధమాన కవులను ప్రోత్సహిస్తూ ఎంతో మంది కవులకు మార్గదర్శకులయ్యారు. 
తానా వారు నిర్వహిస్తున్న ఇంతటి ప్రతిష్టాక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్ట స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి ధన్యవాదాలు తెలియజేశారు.


కామెంట్‌లు