గురుదేవోభవ ;- బల్ల కృష్ణ వేణి-పలాస
ఆది గురువు ఆది శంకరాచార్యుల పాదపద్మములకు ప్రణమిల్లుతూ...
ప్రార్థనా నమస్కారములు చేస్తూ......
గురుబ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
మాతృదేవోభవ...... పితృదేవోభవ..... ఆచార్యదేవోభవ.... అన్నారు పెద్దలు..
శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు.
ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వము ఉపాధ్యాయ దినోత్సవం గా గుర్తించింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 5 న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది.
పాఠశాలలోని ప్రతి విద్యార్థులు రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఈ వృత్తిలో రాణించడం అంత తేలికైన విషయం కాదు. విద్యార్థులలో భయాలను పోగొట్టి, ఆత్మవిశ్వాసాన్ని నింపి, సమాజంలో నిలబెట్టాలి. జ్ఞానాన్ని కాదు విలువలను, ధైర్యాన్ని,, స్థైర్యాన్ని వారికి అందించాలి. అదే సమయంలో విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాలి. గురువు దైవముతో సమానము అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం సత్కరించడం, దేశాన్ని గౌరవించడం సత్కరించడమే.
ఈ ఆధునిక సమాజంలో పాఠశాలలో క్రమశిక్షణ తప్పిన పిల్లలకు ఏ చిన్న శిక్ష వేసిన, తల్లిదండ్రులు గురువులు పై దాడులు చేస్తున్నారు. పిల్లలు ఎదుటే గురువులను దూషిస్తున్నారు. మరి గురువు అంటే గౌరవం పిల్లలకు ఎక్కడ ఉంటుంది.
నేటి విద్యార్థులు, మరియు యువతరం ఎక్కువ చరవాణి (సెల్ఫోన్) , చలనచిత్రాలకు (సినిమా)
వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దుర్బుద్ధిని నేర్పించే ప్రచారాలు విద్యార్థుల మరియు యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది., గురువును గౌరవించే విధానం ప్రచారం చేయాలి. అగౌరవ పరిచే విధంగా ఉండకూడదు.
విద్యార్థుల బంగారు భవితకు మార్గదర్శి గురువే.
నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్ది, ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి విద్యార్థులను తయారు చేసే బాధ్యతను భుజాలపై మోసే గురువు అంటే సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉండాలి.. విద్యార్థుల బంగారు భవితను తీర్చిదిద్దే గురువులకు పాదాభివందనములు. పుష్పాంజలి.
నమస్సుమాంజలి....
................ జై గురుదేవ.............
_________________

కామెంట్‌లు