రా
నిన్ను నేను దేవుని చేస్తా
నన్ను ఆశీర్వదించు
ఆశీర్వదిస్తే నీవు గురుదేవుడవవుతావు!!
గురుదేవుడవవ్వాలంటే
నీవు చదువుకోవాలి!
వందమందికి నీవు చదువు చెప్పాలి!!
వందమందికి నీవు దేవుడవు అవుతావు.
నేను నిన్ను దేవుని చేస్తా రా
నాకు ధనం దానం చేయి
ధనం దానం చేయాలంటే
నీకు ఉద్యోగం ఉండాలి ధనం ఉండాలి!!!
అందుకే పని చెయ్యి చదువుకో!!!?
వెయ్యి మందికి నీవు ధనం దానం చేస్తే
వెయ్యి మందిని నీవు ఆశీర్వదించినట్లు
వెయ్యి మందికి నీవు దేవుడవు అవుతావు.
నేను నిన్ను దేవుని చేస్తా రా
ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టు
లక్షల మందికి నీవు దేవుడవవు అవుతావు
అనాధలను ఆదుకో
అంధులనూ వికలాంగులను ఆదుకో
కోట్ల మందికి నీవు దేవుడవవుతావు!!!
సమయం -ధనం -ఉంటే
సేవ చెయ్యి రాజకీయం కాదు!!?
ప్రపంచానికి దేవుడవవుతావు!!!
చదువు-ధనం-సేవతో -
దేవుళ్ళమవుతాం మనం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి