వ్యాపారి తెలివి .- డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 గుంటూరులో శివయ్య అనే వ్యక్తి టీ అంగడి నడుతూ ఉండేవాడు. ఊరిలో అందరి టీఅంగడిలో ఐదురూపాయలకు ఒకటీ అమ్ముతూఉండగా, శివయ్య అంగడిలో మూడు రూపాయలకే రుచికరమైన టీ అమ్మేవాడు. సాటి టీ అంగడి వాళ్ళు వేయి టీలు అమ్మ గలిగితే,శివయ్య తన అంగడిలో రెండువేలకుపైగా టీలు అమ్మేవాడు.
ఒకరోజు శివయ్య తమ్ముడు ఊరినుండి టీఅంగడి వద్దకు వచ్చి అంగడి లోని వ్యాపారాన్నిచూస్తూ " అన్నా ఎదటి వారు టీ ఐదురూపాలకు అమ్ముతుంటే నువ్వు మూడు రూపాయలకే టీ అమ్ముతున్నావు,అంటే సాయంత్రానికి రెండు వేల టీలు అమ్మకం జరిగితే మనకు నాలుగువేలు నష్టంకదా " అన్నాడు. 
" తమ్ముడు వ్యాపారం చేయడానికి ధనమేకాదు,తెలివితేటలు కావాలి.
ప్రతివ్యాపారంలోనూ ,లాభ,నష్టాలు,కష్ట,సుఖాలు ఉంటియి. మనం చెస్తున్న వ్యాపారం లోటుపాట్లు తెలుసుకుంటేచాలు. హయిగా వ్యాపారం చేయవచ్చు.నావ్యాపారంలో లాభమే కాని,నష్టం ఉండదు. ఒకటీ మూడు రూపాయలకు ఇవ్వడంవలన దానిపై వచ్చే ఆదాయం కర్చులకే సరిపోతుంది. కానీ అలా టీ తక్కువ ధరకు అమ్మటంవలన మనకు నష్టం రాదు,మనఅంగడిలో టీ తక్కువధర కనుక ఎక్కువ జనం వస్తారు. అలావచ్చీనవారు మనఅంగడిలో అమ్మే బిస్కెట్ ,మసలావడ, సమోసా ,పకోడా,బజ్జి,బోండా తదితర తినుబండారాలను చాలామంది తిన్న తరువాతే టీతాగుతారు. ఈతినుబండాలు ఎదటి అంగడి వాళ్ళవద్ద, నావద్ద ఒకేధర, చేపను పట్టడానికి గాలానికి ఎరవేసినట్టు, తినుబండారాలు అమ్ముకోవడానికి టీ వెల తగ్గించాను. టీ వెల నాదగ్గర తక్కువకనుక జనం నావద్దకు వస్తారేకాని మరోకారణం లేదు . టీపైన లాభం పొందలేకపోయినా,తినుబండారలపై మంచి లాభం పొందుతున్నా "అన్నాడు శివయ్య . 
బెల్లంకొండ - దార్ల .
హమి: ఈకథ సొంతరచన ఏభాషలోనూ,ఏమాధ్యమంలోనూ ఇప్పటివరకు ప్రచురింపబడలేదు.; 
కామెంట్‌లు