.చిత్రానికి కవిత ; -..కోరాడ నరసింహా రావు !
ప్రతీ అవసరానికి... ఓ ఉపాయం ఉండే ఉంటుంది  !
   ఆలోచిస్తే... అది తట్టే తీరుతుంది !!

అవసరాలే.... ఆలోచనలను పుట్టిస్తాయ్ !
   ఓ కాకే.. కూజా అడుగున ఉన్న నీటిని... గులకరాళ్లు వేసి 
 అనీటిని పైకి రప్పించి... 
   తన దాహార్తిని తీర్చుకో గలిగి నపుడు..., 
  వీళ్ళు నేటితరం బాలలు..!
     రేపటి మేధావి తరం వీరే !!
  అంతరిక్ష విహారం చేస్తున్న కాలం వీళ్లది... !
     వీళ్లకు పరస్పర సహకారంతో... అసాధ్యాన్ని సైతం సుసాధ్యాన్ని చేసుకోవటాన్ని గురించి... ఏ ఒక్కరూ చెప్పవలసిన పనిలేదు 
      నేటి బాలలంతా... మేధావులే.. !
    ఈ బాల మేధావులే... 
  దేశానికి రేపటి బంగరు భవిష్యత్తు.... !
      అభినందించి... 
   ప్రోత్సహించాల్సిందే.... 
    పెద్దలంతా.... !!
    **&**&******&***


కామెంట్‌లు