తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా కాసుల ధీరజ్ శర్మ*
 ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక  సెప్టెంబర్ 9 వ తేదిన శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న "తెలంగాణ భాషా దినోత్సవం" సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి హైదరాబాద్ కు చెందిన కవి శ్రీ కాసుల ధీరజ్ శర్మను ప్రత్యేక అతిథులుగా తానా సంస్థ వారు ఆహ్వానించారు.
తానా వారు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు తానా అధ్యక్షులు  శృంగవరపు నిరంజన్ నకు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర కు , సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. 
కాసుల ధీరజ్ శర్మ  పలు రచనలతో పాటుగా అనేక కవి సమ్మేళనాలలో పాల్గొంటూ  సాహితీ సేవ చేస్తున్నారు.
అంతర్జాలం లో తానా నిర్వహిస్తున్న ఈ  భాషా దినోత్సవం కార్యక్రమం యప్ టీవీ ద్వారా అనేక యూరప్ దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవటమే కాకుండా, తానా అధికారిక యూట్యూబ్ ఫేస్బుక్ చానల్స్ లో, ఈటీవీ భారత్ వంటి దాదాపు పది యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కాసుల ధీరజ్ శర్మ కు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల పలువురు కవులు రచయితలు అభినందనలు తెలియ జేశారు.

కామెంట్‌లు