జిపిఎస్ జీవో వ్రతులు దగ్ధం


 వారం రోజుల్లో సి.పి.ఎస్. రద్దు చేస్తానని హామీ ఇచ్చిన  ముఖ్యమంత్రి, ఆ హామీని అమలు చేయకుండా మరింతగా నష్టం వాటిల్లేలా జి.పి.ఎస్. విధానాన్ని అమలుచేస్తూ ఈరోజు జీవో విడుదలచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.ఎఫ్.) కొత్తూరు మండల శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఆ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ దండు ప్రకాష్ రావు, మండల శాఖ అధ్యక్షులు కె.విజయ్ కుమార్ లు తెలిపారు. సలహాలు, సూచనలు, విన్నపాలను ఖాతరు చేయకుండా జి.పి.ఎస్.ను అమలు చేసే ఈ అక్రమాన్ని నిరసిస్తూ
మండల పరిధిలో గల మెట్టూరు సెంటర్లో జీవో ప్రతులను దగ్ధం చేశారు.
ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని యుటిఎఫ్ ప్రతినిధులైన దండు ప్రకాష్ రావు, కె.విజయ్ కుమార్ తదితరులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉపాధ్యాయులకు రావలసిన డి.ఎ., మరియు పీఆర్సీ ఎరియర్లు విషయంలో రాని జీవోలు,  జిపిఎస్ విధానం అమలుకు విడుదల చేయడమేమిటని ప్రశ్నించారు.
ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిపిఎస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ మొండి వైఖరి స్పష్టమౌతుందని వారన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ఆర్.ఆర్.ఎం. కొండలరావు, 
పి. దినేష్, బి సింహాచలం, 
కె రాజారావు, వీరభద్రరావు, వెంకటరావు, బాలకృష్ణ, ప్రకాశరావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొని ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
కామెంట్‌లు