అరుణకాంతులు- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అరుణుడు
తొంగిచూచె
అవనిని
తట్టిలేపె

అరుణుడు
ఉదయించె
అందరిని
మేలుకొలుపె

అరుణుడు
ఆకర్షించె
ఆలోచనలను
పారించె

అరుణుడు
కిరణాలనుప్రసరించె
అద్భుతకవితలను
ఆవిష్కరించమనె

అరుణుడు
రాగాలాలపించె
అక్షరాలను
అందంగాకూర్చమనె

అరుణుడు
అందాలొలికె
ఆనందాలను
అంతరంగాలకందించె

అరుణుడు
ఎర్రరంగుచల్లె
ఆకాశాన్ని
దర్శించమనె

అరుణుడు
కలంపట్టమనె
కవితలను
కుమ్మరించమనె

అరుణుడు
నిత్యకవితనువ్రాయమనె
అప్పుడే
దినమునుప్రారంభించమనె

అరుణకిరణాలు
కళ్ళనుచేరె
అందమైనదృశ్యాలు
అగుపించసాగె

అరుణకాంతులు
తనువునుతాకె
అద్భుతకవనము
అందుబాటుకొచ్చె

అరుణతళుకులు
మదిలోదూరె
అంతరంగమును
ఆటలాడించె

అరుణబింబము
తూర్పునప్రభవించె
అఙ్ఞానంధకారమును
అంతరింపజేసె

అరుణతలపులు
ఆవరించె
కమ్మనికైతలు
కాగితాలకెక్కె

అరుణుడు
ఉదయించితె
కవితయు
ఉదయించినట్లె

అరుణుడు
అందరికీదైవమె
అఖిలజగత్తుకు
ఆరాధనీయమె

కవితలు
ప్రతిరోజూవ్రాస్తా
పాఠకులకు
ప్రతినిత్యమూపంపిస్తా

విడువక
చదవండి
మదిని
మురిపించండి


కామెంట్‌లు