కాశీ మజిలీ కథలు . ; - డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 మధిర సుబ్బన్న .దీక్షితకవి రచించిన కథల సంకలనం. దీనిని దీక్షితకవి 12 భాగములుగా వచనమున రచించెను.
దీని రెండవకూర్పు కవిగారి పుత్రుడు కొండయ్యశాస్త్రిచే 1950లో ప్రచురించబడినది. దీనిని 1934లో కందుల సూర్యారావు, రాజమండ్రి వారు రామమోహన ముద్రాక్షరశాల యందు ముద్రించారు.
మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో దక్షిణాత్య ప్రాంతం నుంచి హిందువులకు పరమ పవిత్ర స్థలమైన కాశీ చేరుకునేందుకు కాలినడకన ప్రయాణమవుతారు. ఆ దారిలో జరిగే కథతో పాటు కాశీయాత్రలో వేసుకునే ప్రతి మజిలీలోనూ కథలు చెప్పుకుంటూంటారు. ఆ గొలుసుకట్టు కథలన్నింటి సంకలనం ఈ కాశీమజిలీ కథలు. ఈ గ్రంథం తెలుగు వారిలో మంచి పేరొందింది.
ఇతివృత్తం.
అవిభక్త ఘట్టభూమిగా, మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. తుదకు శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే పశువుల కాపరి, అనాథయైన కోటప్ప మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. కథలలో పతివ్రతల ప్రభావము, దుష్టస్త్రీల కుచ్చితచేష్టలు, సత్పురుష సాంగత్యము వలన కలుగు లాభములు, దుష్టుల సహవాసము కలుగు నష్టములు, దేశాటనము పండితసంపర్కములవలన కలుగు జ్ఞానము, రాజనీతి, వ్యవహార వివేకము, వదాన్యలక్షణము, లోభిప్రవృత్తి మున్నగు అనేక విశేషములు వర్ణించబడినవి. ఇవికాక కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, విక్రమార్కుడు, నారదుడు, ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషుల చరిత్రలను విచిత్రముగా వ్రాయబడ్డాయి.
కథలు.
కొన్ని మజిలీలలోని కథల పేర్లు ఇవి: 
• కథాప్రారంభము - మణిసిద్ధుని కథ, కాశీ మహిమదెలుపు కథ, శివశర్మ యను బ్రాహ్మణుని కథ
• మొదటి మజిలీ - శూరసేన మహారాజు కథ, కృష్ణదేవరాయల జననకథ, మామిడిపండు కథ, వరప్రసాదుల కథ, కానీనుని కథ, దేవతావస్త్రముల కథ
• 2వ మజిలీ - వసంతుని కథ
• 3వ మజిలీ - రాముని కథ
• 4వ మజిలీ - ప్రవరుని కథ
• 5వ మజిలీ
• 6వ మజిలీ - దండుని కథ
• 7వ మజిలీ - విక్రమసింహుని కథ, క్రౌంచద్వీపము కథ, పురుషద్వేషిణి కథ, రత్నాంగి కథ
• 8వ మజిలీ - కృష్ణదేవరాయల కథ
• 9వ మజిలీ - సింహదమనుని కథ, మణిమంజరి కథ, మోహిని కథ
• 10వ మజిలీ - సోమశర్మ కథ, మంగలమంత్రి కథ
• 11వ మజిలీ - బుద్ధిసాగర కామపాలుర కథ, భేరుండపక్షి కథ, శరభశాళ్వము కథ, చిత్రసేన కథ, పద్మావతి కథ, సుగుణావతి కథ, చిత్రసేన కథ
• 12వ మజిలీ - చేపనవ్విన కథ
• 13వ మజిలీ - ఇంద్రద్యుమ్నుని కథ, విశాలాక్షి కథ, మళయాళదేశము కథ, మదనుని కథ
• 14వ మజిలీ - విశాలాక్ష్మీ ప్రవాహము కథ, భీమశర్మ యను బ్రహ్మచారి కథ, కోయపల్లె కథ, అద్భుతఫలము కథ, అద్భుతపుష్పము కథ, ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము
• 15వ మజిలీ - సంగీతవృక్షము కథ, రుచికుని కథ, తిలోత్తమ కథ, బలసింహుని కథ, వీరగుప్తుని కథ
• 16వ మజిలీ - భక్తురాలి కథ, బలదేవుని కథ, జయంతుని కథ, ఇంద్రుని కథ
• 17వ మజిలీ - ధర్మపాలుని కథ, అదృష్టదీపుని కథ, కాంతిమతి కథ, ప్రియంవద కథ
• 18వ మజిలీ - భువనేశ్వరీదేవి కథ, హరిదత్తుని కథ, సత్యవతి కథ, ప్రియంవదా హరిదత్తుల వివాహము, సునంద కథ
• 20 మజిలీ - నారదమహర్షి కథ
• 21 మజిలీ - నారదుని గంధర్వ జన్మము
• 22 మజిలీ - ఉపబహణుని వివాహము
• 23 మజిలీ - మాలావతి కథ
• 24 మజిలీ - కళావతి కథ
• 25 మజిలీ - నారద వివాహము
• 26 మజిలీ - నారదుని స్త్రీజన్మము
• 27 మజిలీ - వీరవర్మ కథ, పద్మసేన కథ
• 28 మజిలీ -క్ష్ సుధనన్వుని కథ
• 29 మజిలీ, రత్నావతి కథ
• 30 మజిలీ, అతలరాజ్యము
• 31 మజిలీ, రాగవర్థనుని కథ
• 32 మజిలీ, జయమల్లుని కథ
• 33 మజిలీ, ఉత్తర దిగ్విజయము, విద్యాసాగరుని కథ
• 34 మజిలీ, ప్రమద్వరక కథ
• 35 మజిలీ, చిలుకమువ్వల కథ
• 36 మజిలీ, చిలుక పురుషుడైన కథ
• 37 మజిలీ, చిలుకలు గుర్రములైన కథ
• 38 మజిలీ, చిలుక బ్రహ్మరాక్షసుడైన కథ
• 39 మజిలీ, బ్రహ్మరాక్షసుని కథ, హరివర్మాదుల కథ, చారుమతి కథ
• 40 మజిలీ, చారుమతి కథ
• 41 మజిలీ, స్వగ్రామ ప్రయాణము
• 42 మజిలీ, పశ్చిమ దిగ్విజయము
• 43 మజిలీ, దేవకన్యల కథ
• 44 మజిలీ, గుణకేశిని కథ
• 45 మజిలీ, సుముఖుని కథ
• 46 మజిలీ, సావిత్రి కథ
• 47, 48 మజిలీలు, క్రోధనుని కథ
• 49 మజిలీ, దక్షిణ దిగ్విజయము, పుష్పకేతుని కథ
• 50 మజిలీ, మణిమంతుని కథ
• 51 మజిలీ, కుందమాల కథ
• 52, 53 మజిలీలు, మయూరధ్వజుని కథ, గోపాలుని కథ, పింగళిక కథ, జగన్మోహిని కథ
• 54, 55 మజిలీలు, నారదుని స్వస్వరూపప్రాప్తి
• 56 మజిలీ, శుకనారద సంవాదము
• 57 మజిలీ, నాగుని కథ
• 58 మజిలీ, నారదపంచచూడ సంవాదము
• 59 మజిలీ, కలియుగ ధర్మములు.
కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథలు పాఠకులను చదివింపజేయడమే కాక పలువురు గ్రంథకర్తలు స్పందించేలా చేశాయి.
• కాశీమజిలీ కథలు సినిమా రంగంపై కూడా తమ ప్రభావం చూపాయి. ఈ కథలు తెలుగు జానపద చలన చిత్రాలను విపరీతంగా ప్రభావితం చేశాయి. కొన్ని చిత్రాలలో కథలకు కథలు యధాతథంగా స్వీకరించి ఉపయోగించుకున్నారు.
• సాహిత్యరంగంలో పలువురు రచయితలు వీటిని అనుసరించి లేదా వీటి స్ఫూర్తితో రచనలు చేశారు. కొన్ని పేదరాశి పెద్దమ్మకథలు, చందమామ కథలు, మర్యాద రామన్న కథల్లో కాశీమజిలీ కథలలోని ఇతివృత్తాలు, శైలి, నాటకీయత, శిల్పం వంటివి అనుసరించినట్లు తెలుస్తుంది.
• ఇవి కేవలము కథల వంటివేగాక వ్యాకరణాది శాస్త్ర సంప్రదాయములయందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీన కావ్యములకించుక దీసిపోవు.. -చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి
• ఇందు పారమార్థికులకు తప్ప సామాన్యులకు రుచింపని శంకరాచార్య చరిత్రములతి రసవంతములుగ బరమార్థ బోధకంబులుగ కథా ధోరణిగ కూర్పబడినవి. -మానవల్లి రామకృష్ణ కవి ..

కామెంట్‌లు