* రక్షణ కవచం * అంటే....
తెలియునా మీకు పిల్లలూ !?
పూర్వం రాజులు యుద్దాలలో
శత్రువులఆయుధముల నుండి...
తమను తాము కాపాడు కొనగ
శరీరమునకు ధరించు...
కంచు తొడుగులర్రా ....!
నేటి మానవులకు ఎండా, వానలు, రాళ్ళూ, ముళ్ళూ...
అనుకోని హఠాత్ రోడ్డు ప్రమాదాలు... !
ఇవియే పెద్ద శత్రువులు !!
ఎండకు - వానకు రక్షణ కవచం
మన చెంత నుంచుకొను గొడుగే నర్రా... !
ముళ్ళూ, రాళ్ళనుండి...
మనపాదాలకురక్షణనిచ్చును, పాద రక్షలు !
అర్ధం కాలేదా..,పాదరక్షలంటే
కాళ్లకు తొడిగే చెప్పులర్రా !!
వాహనాలపై ప్రయాణాలలో...
మన ప్రాణాలను రక్షించేవి
తలకు ధరించే శిరస్త్రానాలే..
పిల్లలూ శిరస్త్రాణాలు అంటే... హెల్మెట్లే నర్రా... !!
ఆదిమానవులే... ప్రాణ రక్షణకు
రాయి,కర్రలతోఆయుధాలను..,
సుఖముగా నివసించేందుకు
రక్షణనిచ్చేనివాసగృహములను
నిర్మించుకొనిరి...తెలియునా మీకు !
ఎప్పటికి యే రక్షణఅవసరమో
అప్పటికి దానినికనుగొనగలరు
మన తెలివైన మానవులు !!
రక్షణ కవచం అంటే మీకు
బోధపడిందా పిల్లలూ... !
ఈ రక్షణ కవచములను మీరు
చక్కగ వినియోగించండి !!
...సుఖముగా జీవించండి !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి