గుడి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 గుడికీ, జీవితానికీ 
విడదీయలేని సంబంధం 
గుడికి వెళ్ళి వచ్చినవాడు 
భక్తుడు! 
తనలోనే గుడిని చూసుకున్నవాడు 
ముక్తుడు! 
బాధ వచ్చినప్పుడు 
గుడిని తలచేవాడు 
ప్రమత్తుడు! 
బోధ కలిగేదాకా
గుడికి తిరిగేవాడు
అప్రమత్తుడు!
గుడిని బడిగా భావిస్తే 
కలిగేది కాంతి! 
గుడిని గుడిగా దర్శిస్తే 
కలిగేది శాంతి! 
ఆశయానికి ఆకారం 
ఆలయం! 
అదిలేనినాడు 
కలిగేది ప్రళయం!!
*********************************
.
కామెంట్‌లు