.రారండోయ్! రారండోయ్!;- పద్మావతి ‌పి.,-హైదరాబాద్
తొలి పొద్దు కిరణం పొడిచిందోయ్
తెల తెలవారెను  లేవండోయ్

కిలకిల చిలుకల పలుకులు వినరొండోయ్ 
ఉరుకుల పరుగుల రారండోయ్

బడిగంటల జేగంటలు వినరొండోయ్
బిరబిర చరచర గలగల రారండోయ్

జోరుగా హుషారుగా రారండోయ్
అందరు కలిసి ప్రార్ధనాగీతం పాడండోయ్

ప్రకృతి ఒడిలో ఉల్లాసం నింపగ రారండోయ్ 
పచ్చని చెట్లను నాటగ అందరూ ఒకటై కూడండోయ్

పుడమి వొడిని నింపగ  రారండోయ్
మొక్కలు నాటగ మట్టిని తవ్వండోయ్

కలకల గలగల సైకిలు తొక్కండోయ్

ముద్దుగా ముద్దుల మూటలై  నవ్వండోయ్

అయ్యవారికి భక్తితో మొక్కండోయ్
శ్రద్ధగా బుద్జిగా చదువులు చదవండోయ్..
కామెంట్‌లు