కృష్ణం వందేజగద్గురుమ్;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.
జీవితసారమే భగవద్గీత
వసుదైకానికే ఆదర్శం
స్నేహానికి పేద గొప్ప తారతమ్యాలు లేవన్నదే
కృష్ణ కుచేల స్నేహబంధం
జీవితం అంటే నవరసభయం
ప్రేమతత్వమే ముముక్షత్వమన్నదే
శ్రీ కృష్ణ పరమాత్మ జీవితం.!!

నైతిక విలువలు నేర్పిన
గురువే దైవమని
తన గురువు సాందీపుని
కుమారుని యమునితో పోరాడి రక్షించిన మహనీయుడు
శ్రీకృష్ణ లీలలు జగతి ప్రగతికి సోపానాలు
రాధా కృష్ణుల ప్రేమ
అలౌకికానందం
లోకానికే ఆదర్శం..!!

శీతోష్ణ సుఖదుఃఖేషు
తథామానవమనయో అని
కష్ట సుఖాలలో చలించక
ముందుకు సాగేవాడే స్థితప్రజ్ఞుడు అతడే ఆదర్శ మానవుడని
కర్తవ్యనిర్వాహణ చేయడం
ప్రతి మానవుని పని అని
సత్ సంకల్పం తో చేసిన పని
తప్పక విజయం చేకూరునని
ధర్మానుసారం జీవిస్తే సాధించలేనిది లేదని  చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ
లోకానికే గురువు
అందుకే 'కృష్ణం వందే జగద్గురుమ్' అన్నారు పెద్దలు..!!
.............................


............................

కామెంట్‌లు