శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 రంగ్రూట్ అనే హిందీ పదం కి అర్ధం రిక్రూట్.పోలీస్ సేనలో భర్తీ అయిన కొత్త వ్యక్తి.
రఘువంశం సూర్య వంశం కి చెందిన అనమిత్రుని కొడుకు రఘు మహారాజు పేరు మీదుగా వచ్చింది.అందుకే రాముని రఘువంశ తిలకా రఘురాం అనికూడా పిలుస్తారు.
రజనీగంధా రాత్రి పూట వికసించి కమ్మని పరిమళాలు వెదజల్లే పూలు.
రజనీచరుడు అంటే రాత్రి అంతా తిరిగే చంద్రుడు.ఎక్కువగా మనం నిశాచరులు అని రాక్షసులకి ప్రయోగిస్తాం.
రజ్జాక్ అనేది అరబిక్ పదం.అరబ్బీలో రిజక్ అంటారు.దీని అర్థం రోజు ఆహారం ఇచ్చేవాడు అన్నదాత అని.అన్నం తినిపించే వారినికూడా రజ్జాక్ అని అంటారు.
రణఛోడ్ కృష్ణునినామం.కాలయవనుడు అనేవాడివలన మధురను విడిచి ద్వారకలో ఓగుహలో దాగాడు. వాడిని ముచుకుందుని చేత భస్మం చేయిస్తాడు.గుజరాత్ లో కృష్ణుని రణఛోడ్ అని పిలుస్తారు.తమకొడుకుకి రణఛోడ్ దాస్ అని పేరు పెడతారు

కామెంట్‌లు