మమత;- కొప్పరపు తాయారు
 ప్రేరేపించి మమతని
 పంచె మంత్రమే ప్రేమ  
ఎల్లలు లేవు, హద్దులు లేవు
ఆకాశం ,సముద్రం సిగ్గుపడు

ప్రేమని చూసి ప్రేమిస్తే
చాలు పంచుతాం ఆదరణ.
కల్మషం లేదు కపటం లేదు
స్వచ్ఛత సంపూర్ణం !

అందుకే అందరం మేము
ఒకటే భావం మాది
ఒకటే మాట మాది అందుకే
మా భారతీయులందరూ

ప్రేమైక జీవులం అనునిత్యం
నూతనంగా పయనిస్తాం
ఆదరిస్తాం ప్రేమాభిమానాలు
మాకు పెన్నిధి, అందుకే మాకు 

విలువ ఎక్కువ, ప్రేమ 
భగవంతుడు స్వరూపం
ఆ ప్రేమాభిమానాలే
మా ప్రత్యేకత!!!

కామెంట్‌లు