శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాక్షసులు అంటే అసలు అర్థం రక్షించేవారు అని.రక్షన్వయస్మాత్ రక్షఃరక్ష ఏవంరాక్షసః.రక్షస అనేపదం రాక్షస వచ్చింది.ఈరెంటి అర్థం ఒకటే.వీరినే అసురులు దైత్యులు అన్నారు.ఇరాన్ లోఅసుర అనేపదం అహుర్ గా పేర్కొంటారు.జేంద్ భాషలోఅసుర అంటే దేవత దాని అర్థం రాక్షస.ఫారశీలోదేవ ప్రేత రాక్షస అంటారు.భారత్ లోఅసుర అంటే రాక్షస  సంహారం అంటే దేవతలు.ఆర్యుల హింద్ ఇరానీ శాఖ దక్షిణ రష్యా నుండి ఇరాన్ వెళ్లి అక్కడ రెండు గా చీలిపోయింది.ఒకటి భారత్ లో వేదాలు రచిస్తే రెండోశాఖ ఇరాన్ లో ఉండిపోయింది.జెందావెస్తా రాశారు.దేవాసుర సంగ్రామం ఈరెండు శాఖలమధ్య జరిగింది అని చరిత్ర కారుల అభిప్రాయం.
రామాయణం లో రాక్షసుల ఉత్పత్తి గూర్చి ఓకథ ఉంది.ప్రద్యోని తాను సృష్టించిన ప్రాణుల రక్షణకోసం కొన్ని జీవుల్ని సృజించాడు.అవి ఆకలిదప్పులతో అలమటిస్తూ ప్రజాపతి దగ్గర మొరపెట్టుకున్నాయి.వాటికి మనుషుల్ని రక్షించే బాధ్యతను అప్పగించాడు.వారిలోకొందరుబుభుక్షితసత్వ రక్షాం అనబడే రాక్షసులు గా యక్షాం అనే వారు యక్షులు గా పేరు పొందారు🌹
కామెంట్‌లు