"వృక్ష రక్షతి రక్షిత "పోటీలలో విజేతలకు బహుమతులు

 సర్వేజన ఫౌండేషన్-శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ మాసంలో నిర్వహించిన
 "వృక్ష రక్షతి రక్షిత "పోటీలలో పాల్గొని బహుమతులు పొందిన విద్యార్థులకు పెద్ద బాలశిక్ష పుస్తకాలను
ఈ రోజు ప్రార్థనా సమావేశంలో ప్రిన్సిపాల్ శ్రీమతి కె.కృష్ణవేణి గారు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో అందించడం జరిగింది.విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం కోసం, భవిష్యత్ తరాలు ఉత్తమ విలువలతో జీవించుట కొరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్న సర్వేజనా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ కింతలి సన్యాసిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

కామెంట్‌లు