తెలుగు దోహాలు ; -ఎం.వి.ఉమాదేవి

 81) లౌకిక సామ్యవాదములే, దేశ ప్రజలకిమేలగు!
గణతంత్రపు సంబరములే , వాడవాడలను చెలగు!
82)
కవనము కూడా వ్యసనమే, హానిలేనితీరుండు!
సొంత భావనలు విజయమే, ఎంతయినను చోటుoడు!
83)
మరణము తత్వమె ఎవరికీ, అర్థమవని మాయకద!
ఆశలు,మోసం వదలవే, చివరిరోజు వీడుకద!
84)
ప్రేమయె నిప్పుల గుండమే, కాలకుండ దాట వలె
సమాజ ముద్రయె వ్రతముగా, చివరివరకు సాగవలె!
85)
చిక్కని చీకటి కమ్మినా, ముఖ్యవెలుగు సత్యమగు!
బ్రతుకున సమరం చేసినా, మానవతయె సూత్రమగు!
85)
పరిధులుండక అహాలకే  రక్తబంధములు తొలుగు!
నిజానికిదియే దూరమై, ఘనులనె జేయును మరుగు !
86)
కన్నతల్లికీ వివక్షా, కాలరీతి కలియుగము!
కుంతికి వరమే కావలే , కర్ణ కథను భారతము!
87)
పొడిపొడి మాటల సూచనే, ప్రేమకరిగి పోయెనని!
తడియా రనివిక కన్నులే, హృదిని గాయపరచెనని!
88)
కుటుంబ శ్రేయము కోరుతూ , బాధ్యతలనిచవి  చూడు
నిరతoబగు నీ ప్రక్రియే, త్యాగఫలితమే గూడు!
89)
ఏటికి ఎదురది ఈదినా, ఫలములేదు ఒకనాడు
సోమరి గానే నిలిచినా, రాజరికమె వెంటాడు!
90)
కాలపు ధర్మము గొప్పదే, కల్మషాల తొలగించు
మానవ స్వార్థం వల్లనే, మాయగాను కనిపించు!
91)
ఆమని పంచమి విభవమే, బాలమిత్ర తెలుగౌను
కొంత కొంత ఉపశమనమి స్తూ,  మదికి తగిన వెలుగౌను!!
92)
చుక్కల దారుల వెతికినా, అమ్మజాడ లేదచట
మక్కువ బాల్యము దాటినా, కంటిచెమ్మ ఆరదట!!
కామెంట్‌లు