వరలక్ష్మీ వ్రతం ;- ... కోరాడ నరసింహా రావు !
పవిత్ర శ్రావణ శుక్రవారము.... 
   భక్తి, శ్రద్దలతో చేస్తుంది..అమ్మ     వరలక్ష్మీ వ్రతము ... !

పాపా... నీవు శ్రద్ధగ చూడు.... 
   చూసి చక్కగ నేర్చుకో  ... !
వరలక్ష్మీ వ్రతమెలా చేయాలో. l 
 వరముల నిచ్చి, శుభములు కూర్చు  శ్రీ మహాలక్ష్మి తల్లి... !

ఇల్లంతా చక్కగా శుభ్రము చేసి... 
   ద్వారములకు పసుపూ, కుంకుమ బొట్లు పెట్టి ... 
.   వాకిలి అంతా రంగు - రంగు ల...అందమైన ముగ్గులువేసి...
పూలు,మామిడితోరణమ్ములు 
వరలక్ష్మీమాతకు   స్వాగతమ్ములు !

చీర, రవిక, గాజులు, పువ్వులు 
  రక, రకాల పండ్లు !
  పూజా ద్రవ్యము లన్నింటినీ 
  సిద్ధపరచుకొని....  !

వేకువజాము ననే తలంటి, స్నానము చేసి.., 
వరలక్ష్మీ  మాతను అందముగా అలంకరించి.... 
  పులిహోర, బూరెలు... -పరమాన్నములను...    
 నైవేద్యముగా సమర్పించి.., 
   చివరిగా కొబ్బరికాయను కొట్టి... 
     దీప,ధూప, నైవేద్యములతో
   అలరారేడు మాత కు.... 
   కర్పూర నీరాజనమిచ్చి... 
   మనసులోని కోర్కెలను  
    ఆమ్మకు విన్నవించిన.... 
 ఆ తల్లి అనుగ్రహించి... దీవించును మనను .. !!
    పాపా శ్రద్దగా చూసి నేర్చుకో... 
   సౌభాగ్యవతివై, కలకాలం 
     ఆనందంతో వర్ధిల్లు.. !!
       ****** 


కామెంట్‌లు