ఆచార్యదేవోభవ వ్యాసరచనకు చక్కని స్పందన

 ఆచార్యదేవోభవ అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలకు అపూర్వమైన స్పందన లభించిందని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు.  
శ్రీకాకుళం జిల్లా శ్రీసత్యసాయి సేవా సంస్థలు విద్యావిభాగం వారిచే నిర్వహించబడిన వ్యాసరచన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. కడుము 
శ్రీసత్యసాయి సేవాసమితి కన్వీనర్ బి.ప్రదీప్ కుమార్, యూత్ సేవాదళ్ కో ఆర్డినేటర్ ఆర్.లక్ష్మణరావుల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. 
ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలైన విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నామని అన్నారు.  
పోటీలకు పర్యవేక్షకులుగా తెలుగు ఉపాధ్యాయులు వల్లూరు లక్ష్మునాయుడు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవిలు వ్యవహరించారు. 
ఈ సమాజంలో ఉపాధ్యాయ బాధ్యతలకు ఉన్న విలువలు, గురువులను దైవ స్వరూపంగా కొలువబడుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పూర్వము నుండి గురుబ్రహ్మగా పూజించే ఆచారాలకు ప్రాధాన్యమిస్తూ, నాటినుండీ బోధించే ఆచార్యులను ఉదహరిస్తూ విద్యార్థులు చక్కని వ్యాసరచనలు వ్రాసారని ఉపాధ్యాయుల సిబ్బంది కార్యదర్శి తూతిక సురేష్ అన్నారు.   అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈ పోటీలలో పాల్గొనిన బాలబాలికలైన మల్లిబోయిన త్రివేణి, బూరాడ రోజా, వలురోతు లక్ష్మి, బూరాడ జోహన, సారిపల్లి దీపక్ లు ఆచార్య దేవోభవ అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన సందేశమిచ్చేలా మాట్లాడారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు వ్యవహరించారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
కామెంట్‌లు