నీవెవరూ ? - కుమ్మరి అనురాధ, 10వ,తరగతి - సి,ప్రభుత్వ ఉన్నత పాఠశాల,-రాజభవన్, హైదరాబాద్.
కష్టం వచ్చినప్పుడు భయపడే వాడివా ?
నష్టం వచ్చినప్పుడు ఏడ్చేవాడివా?
ఆపదలో ఉన్నవాడిని రక్షించే వాడివా?
ఎదుటివాడిని మోసం చేసేవాడివా?
కన్నతల్లిని కళ్ళతో చూసేవాడివా ?
 లేక 
 కాళ్లతో తన్నేవాడివా ?
తోడబుట్టిన వాళ్లని ప్రేమగా చూసేవాడివా? 
 లేక 
కౄరంగా ప్రవర్తించే వాడివా?
అక్కచెల్లెళ్ల లాంటి ఆడ బిడ్డలను ఆదరంగా చూసే వాడివా ?
 లేదా 
 క్రూరంగా ప్రవర్తించే వాడివా ?
నేటి సమాజానికి పేరు తెచ్చి పెట్టే వాడివా? 
ఈనాటి సమాజాన్ని కొల్ల గొట్టేవాడివా?  
సాటి వాడిని ఎదుగనిచ్చే వాడివా ?
తోటి వాడిగా బ్రతికే వాడివా ?
గొప్పవాడిగా ఎదిగే వాడివా ?
అందుకే 
నిన్ను నీవు పరిశీలించుకో !
సాత్వికమైన బ్రతుకును ఎంచుకో !

కామెంట్‌లు
Suri చెప్పారు…
Manchi Kavitha
తెలుగోల చెప్పారు…
బాగుంది. సమాజం పట్ల మీకున్న బాధ్యతను కవితలో ప్రశ్నల ద్వారా ప్రదర్శించిన వైనం నాకు నచ్చింది. ప్రస్తుతం కవులు, రచయితలు, కళాకారుల్లో ప్రశ్నించే తత్వం పోతోంది. మీలాంటి వాళ్లు ముందుకు రావాలి. మీకివే నా అభినందనలు
M. Radhika చెప్పారు…
అనురాధ కవిత్వం చాలా అద్భుతంగా వర్నిచావు. అల్ ది బెస్ట్ ��
బెండి ఉషారాణి చెప్పారు…
అనురాధ చాలా చక్కగా రాసావ్ అమ్మ! చిన్న వయసులోనే జీవితాన్ని కాచివడ బోసిన అనుభవజ్ఞులు రాసినట్టుగా రాశావు! నీకు, నిన్ను ప్రోత్సహించిన వారందరికీ అభినందనలు!!
శారద చెప్పారు…
బాగుందమ్మా నీ కవిత్వం. సందేశాత్మకంగా ఉంది నేటి సమాజానికి తాను ఎలా ఉన్నారు పరీక్షించుకుని ఒక అవకాశాన్ని అందించేలా ఉంది. ఇలాగే రాస్తూ ఉండు నిన్ను మలచిన మీ గురువులకు నమస్కారం.
Meylwin చెప్పారు…
Very good very all the best
Dr
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుందమ్మా! ఇలాగే ముందు ముందు మంచి కవితలు రాయాలి. అభినందనలు
. ఆశీస్సులు.
-- జి. వి. నరసింహ మూర్తి
(శాంతమూర్తి )
9704867867
చక్కని కవిత మంచి రచయితగా ఎదగాలని కోరుకుంటున్నాను
vyomkesh చెప్పారు…
అభినందనీయం
విజయోస్తు
Muvvala Rambabu చెప్పారు…
అమ్మా నీ భావుకత అద్భుతం ....
🙏