సహజ కవి దువ్వూరి రామిరెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆంధ్ర సాహిత్యలో  వ్యాస మహర్షి రచించిన  భారతాన్ని  నన్నయ తిక్కన, ఎర్రన  కవిత్రయం ఎలా  అనువదించి భారతదేశానికి  అందించారో అంతకుమించి  వ్యాసుల వారి  రచనకే మెరుగులు దిద్ది  అనువదించిన  సహజ పండితుడు బమ్మెర పోతనామాత్యుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తనతో రచింపజేసినట్లుగా చెప్పుకున్న వినయశీలులు  తాను ఎంతో  సుకుమారంగా  వ్రాస్తున్న సంగతి మహారాజుకు తెలిసి తనకు అంకితం ఇవ్వమంటే  నేనింత అందంగా పెంచుకున్న  నా కావ్య కన్యకను గూలులకు ఇచ్చే నీచ స్థితిలో లేను  అని తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేసిన మహానుభావుడు.. ఆంధ్ర సాహితీ సామ్రాజ్యంలో మేలు పర్వతం లాంటి మహానుభావుడు  బమ్మెర పోతనామాత్యులు గారు.
అలాంటి మహానుభావునితో పోల్చదగిన ఏకైక  కవి శ్రేష్టులు  ఆంధ్రదేశంలో దువ్వూరి రామిరెడ్డి గారు  ఇద్దరూ వ్యవసాయదారులే  సమాజంలో ఉన్న పౌరులకు  వ్యవసాయం ద్వారా  వారి ఆకలిని తీర్చినట్లుగానే  సాహితీ రంగాల్లో  తమలైన సొంత శైలితో వీరు ఏ ఒకరిని అనుకరించడం కానీ అనుసరించడం కానీ చేయక  సామాన్యుని మస్తిష్కానికి కూడా  అర్థమయ్యే పరిభాషలో వ్రాయగలిగిన  గొప్ప కవులు  పోతన రామిరెడ్డి గార్లు వీరిద్దరూ కూడా కొన్ని అనువదించినా వారి శైలి జోలికి వెళ్లకుండా  తమ సొంత పద్ధతిలోనే  కవితలు అందించిన స్వతంత్ర రచయితలు  ఏ అంశాన్ని వారు వ్రాయ తలుచుకున్న  దానిలో  ఎంతో సహజంగా  వేదాంతములు కూడా చెప్పగలిగిన  ఆధ్యాత్మికవేత్తలు.
స్వయంకృషితో  ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా ఆంధ్రదేశంలో  అనేక భాషలను నేర్చుకున్న  అద్భుత వ్యక్తులు డాక్టర్ ఎస్ సంజీవదేవ్ గారు  వేలూరి శివరామశాస్త్రి గారు  అంత కృషి చేసి  దువ్వూరి రామిరెడ్డి గారు కూడా  అనేక భాషలను  తన సొంతం చేసుకుని  ఆంధ్ర భాషను ఎంత  అద్భుతంగా చెప్పగలరో అంత గొప్పగా తను నేర్చుకున్న పద్ధతిలో కూడా చెప్పగలిగిన మేధావి  దువ్వూరి గారు చేసిన  సాహితీ ప్రక్రియలు లెక్కలేనివి  వారు రాసిన ప్రతి గ్రంథం  వేదములకు ఏమాత్రం తీసిపోని పద్ధతిలో  మన ముందుకు రావడం  సామాన్య మానవులకు కూడా వేమన పద్యాల వలె  అందరి నాలుకలపై నడయాడడం మన అదృష్టం. అతి పిన్నవయసులోనే  వారి కలం ఆగిపోవడం మన దురదృష్టం. అలాంటి మహానుభావుడు వ్రాసిన గ్రంథాలనుఒకసారి చూద్దాం.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం