పూలబాట;- ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్,- భైంసా,9441333315
ఆటవెలది.
ఓటు విలువ తెలసి ఓట్యేయ వలయును
నోటు కాశపడిన చేటు యగును
నోటు కన్న మిన్న ఓటుకుండునెపుడు
పుండలీకు మాట పూలబాట

కల్లుకాశ పడిన నిల్లుగుల్లయగును
భరత దేశమంత బ్రతుకు చెడును
నిజము తెలిసి నడువ నిలకు మంచి జరుగు
పుండలీకు మాట పూలబాట


కామెంట్‌లు