సృజన రంజనీ సమాజాన్ని స్థాపించినప్పుడు ప్రజా సేవకు అంకితం కావడమే తప్ప మూఢనమ్మకాలను మాన్పించి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలలో పెంచాలి సామాజిక స్పృహతో అందరూ ఐకమత్యంగా ఉండి నేను నేను అన్న స్వార్థం కాకుండా మనం మనం అన్న నినాదంతో ముందుకు రావాలి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే స్వయంగా ఏర్పాటు చేశారు. చాలాకాలం వరకు రాజకీయాల ప్రసక్తి లేదు చతుర్వేదం కృష్ణయ్యకు మద్రాసులో విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిదంబరం పిళ్ళై ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో సానిహిత్యం వల్ల విప్లవోద్యమంతో సంబంధం ఏర్పడింది కృష్ణయ్య నెల్లూరు వచ్చి యువజనులను ఆకర్షించారు ఆయనకు వెన్నెలకంటి రాఘవయ్య గారు వారికి కుడి భుజంగా నిలిచారు. వీడు ప్రోత్సాహంతో రహస్య కార్యకలాపాలకు వీలుగా ఉండడానికి పల్లెపాడు లో కనకమ్మ ఆర్థిక సహాయంతో మామిడి తోపు కొనుగోలు చేశారు 1918లో కనకమ్మ గారి ఇంటి సమీపంలో కూడా చాకలి ఇంటిలో నిషిద్ధ విప్రవ సాహిత్యం భద్రపరిచారు ఆ విషయం రహస్యంగా పరిశీలించడానికి నెల్లూరు నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ గారికి యువతీ యువకులు రాట్నాలు వడకడం కనిపించింది ఆయన ఎంతో సంతోషించి వివేకానంద లైబ్రరీకి 16 రూపాయలు విరాళం ఇచ్చి వెళ్లారు వీర సావర్ కార్ రాసిన ది ఫైర్ ఆఫ్ వార్ ఇండియన్ ఇండిపెండెన్స్ అన్న పుస్తకానికి తెలుగు అనువాదం చేయమని చతుర్వేదుల రాఘవయ్య గారిని కోరారు అది ముద్రించి రహస్యంగా పంచారు.
అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి