ఆదర్శజీవి సుబ్బారావు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను హైస్కూల్లో చదువుతున్న సమయంలో మా గ్రామంలో వామపక్ష పార్టీ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తులు చాలామంది ఉండడంతో  దాని ప్రభావం మా  ఉన్నత పాఠశాల పైన  కూడా పడింది  పార్టీకి అనుబంధంగా ఎస్.
 ఎఫ్ అన్న పేరుతో  స్టూడెంట్స్ ఫెడరేషన్  సంస్థను స్థాపించి  దాని ద్వారా హక్కులను సాధించడానికి  ఏర్పాటు జరిగేవి.ఆ సమయంలోనే  మానికొండ సుబ్బారావు గారు  గన్నవరం లో ఉన్న కృష్ణ  తో కలిసి మా గ్రామానికి రావడం  మా అందరినీ సమావేశపరచి  విద్యార్థుల  బాధ్యతలతో పాటు  హక్కులు కూడా ఉన్నాయి  వాటిని సరిగా వినియోగించుకున్నట్లయితే  ఉత్తమ విద్యార్థులుగా మీరందరూ పెరగడానికి అవకాశం ఉంటుంది  అంటూ మేము చేయవలసిన అనేక కార్యక్రమాలను గురించి  ఆరోజు సుబ్బారావు గారు మాట్లాడారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో వారిని కలవడం  విషయాలు మాట్లాడుకోవడం  సమస్యలను తీర్చుకోవడం  జరిగింది  1963 లో  నా ఆదర్శ వివాహానికి దంపతులు ఇద్దరు సుబ్బారావు గారు  సూర్యావతి గారు పెద్దలు హాజరై తమ తమ అమూల్యమైన  అభిప్రాయాలను చెప్పడం  ఆ సందర్భంగానే హైస్కూల్లో జరిగిన విషయాలన్నిటినీ సుబ్బారావు గారు  జ్ఞాపకం చేయడం విశేషం  1918లో  నందమూరి లో జన్మించిన మానికొండ సుబ్బారావు త్యాగమయ జీవితం ఈనాటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయం  మద్రాసులో వెటర్నరీ డాక్టర్ కు చదువుతూనే ఆ కాలేజీలో దొరుకుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా  చదువుకు స్వస్తి చెప్పి స్వగ్రామం చేరారు  1937లో సుబ్బారావుకి వివాహమైంది వరకట్నం మిద్దరు  మొక్కువ చూపగా నేను పెళ్లి చేసుకుంటున్నది పిల్ల నా డబ్బునా అని సూటిగా ప్రశ్నించడంతో  పెద్దలు తమ అభిప్రాయాలను విరమించుకొని  సుబ్బారావు  అభిరుచి మేర ఆ వివాహం జరిగింది  1938-39 లో కమ్యూనిస్టు ప్రముఖులు  అన్నా ప్రగడ కామేశ్వరరావు గుంటూరు జిల్లా మంతెనవారిపాలెంలో విద్యావనం అనే ఆదర్శ పాఠశాల ప్రారంభించారు  బాల్య దశలోనే బాల బాలికలలో నూతన ఆదర్శాలను ప్రేరేపించి వారిని నూతన విద్యా విధానంతో తీర్చిదిద్దాలన్న ఆశయంతో  సేవాదృష్టితో సుబ్బారావు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు  పిల్లలతో మమేకమై  వారి పాటాలనే కాక జీవిత సత్యాలు కూడా  వారికి తెలియజేస్తూ  కుల మత వర్గాలకు వ్యతిరేకంగా  సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విశేషాలను  చెబుతూ ఉండేవారు.

కామెంట్‌లు