నండూరి వారు సవ్యసాచి కలం పేరుతో రాజకీయ న్యాయ రచనలు హరివిల్లు పేరుతో బాలగేయాలు ఉషశ్విని పేరిట కవితలు రచించారు మిత్రలాభం మిత్రభేదం పంచతంత్ర కథలు బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు ఇంద్రగంటి శ్రీకాంత శ్రమతో కలిసి మహా సంకల్పంఅన్న సంకలనాన్ని విలువరించారు శ్రీకాంత్ శర్మ గారు ఆంధ్రజ్యోతి నుంచి వచ్చి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరి ఎన్నో నాటకాలను రాసి శ్రోతల మన్ననలను పొందారు వారు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి కుమారులు.హనుమత్ శాస్త్రి గారు మా కేంద్ర సంచాలకులు రజనీ గారికి గురువుగారు ఆ అనుబంధంతో ఎన్నో రచనలు శ్రీకాంత్ శర్మ రేడియోకు అందించారు. నండూరి వారు సంపాదకత్వాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి లాంటి రచనలు ఆయన వ్రాసినవే వీరు రాసిన ఐదు పుస్తకాలను స్టూడెంట్ బుక్ సెంటర్ అధినేత బాబ్జి ప్రచురించి 2006వ సంవత్సరంలో మే 9వ తేదీన ప్రముఖల సమక్షంలో ఆవిష్కరించారు ఆయనను గొప్పగా సత్కరించారు కూడా ఆంధ్ర పత్రికలో పని చేసే రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు పండితారాద్యుల నాగేశ్వరరావు సాహిత్య విషయాలపై ఎన్నోసార్లు చర్చలు కొనసాగించేవారు. ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి మిగిలిన వారితో నండూరి వారి సంబంధం అనుబంధం పెన వేసుకుని ఉండేది భారతీయ చింతన పాశాత్య చింతన చిరంజీవి చిరంజీవులు వ్యాసా వలి అక్షర యాత్ర ఉషశ్విని చిలక చెప్పిన రహస్యం పిల్లల కోసం మయూర కన్య పిల్లల నవల హరివిల్లు పిల్లల కోసం గేయాలు లాంటివి ఎన్నో రాశారు. హైదరాబాద్ వారి అభినందన సంస్థ నుంచి ముట్నూరి కృష్ణారావు అవార్డు హైదరాబాద్ జూలూరి నాగరాజు స్మారక బహుమతి మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది వేడుక అవార్డు కళాసాగర్ అభిరుచి పాత్రికేయ రత్న లాంటి బిరుదులు జమీన్ రైతు వజ్రోత్సవంలో నెల్లూరు వెంకట రామానాయుడు అవార్డు సి వై చింతామణి జవాన్ తెలుగు విశ్వవిద్యాలయం వారి డాక్టరేట్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి శిరోమణి అవార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి బహుమతి తెలుగు విశ్వవిద్యాలయం వారి తాపీ ధర్మారావు అవార్డు అప్పాజోష్యుల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి శ్రీపాద కృష్ణమూర్తి అవార్డు సందర్భంగా మా చేతులమీదుగా ఆయనకు బహుమతి రావడం నాకెంతో ఆనందం.
ప్రజ్ఞాశాలి నండూరి - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి