ప్రజ్ఞాశాలి నండూరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒక పత్రికను నిర్వహించడంలో  ఎంత సామాజిక స్పృహ ఉండాలో  సమాజం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉండాలో తెలిసినవారు  వారు ఎంతో మందికి గురుతుల్యులు. మార్గనిర్దేశకులు ఎంతోమందిని పాత్రికేయులనుగా తీర్చిదిద్దిన గురువులు పాత్రికేయులే కాక రచయితగా కూడా ప్రఖ్యాతిగాంచారు  పత్రికా రంగంలో అంతటి సంగీత సాహిత్యం ఎరిగిన వ్యక్తి ఉండడం చాలా అరుదు  ఆంధ్ర పాత్రికేయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన  మేధావి చాలాకాలం  ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదక బాధ్యతలను నిర్వహించి బాల అనే పత్రికలో పనిచేశారు. ఆంధ్ర పత్రికలో 1941లో ఆయన రచనలు ఎన్నో ప్రచురించబడ్డాయి. నరావతారం, విశ్వరూపం ఆయన ప్రముఖ రచనలు. సామాన్య ప్రజలకు సైన్స్ విషయాలను పరిచయం చేయడంలో నండూరి వారి కృషి మరువలేనిది  ఆయన ఆన్సర్ పత్రికలో పనిచేస్తున్న సమయంలో mart twin నవలకు తెలుగు అనువాదాలు చేశారు దశాబ్దాల క్రితం నండూరి  ఆంధ్రపత్రికలో పిల్లల కోసం ఒక ధారావాహిక కాంచన  ద్వీపం mart twin రాంసాగర్ హాకల్ బెరీఫిన్ రాజుపేట విచిత్ర వ్యక్తి అనువాద రచనలు ఆకట్టుకునేవి  అనువాదం కూడా మరో భాష నుంచి అనువాదాన్ని చేసినట్టు కాకుండా తెలుగులో అచ్చు ఆయన వ్రాసిన రచన లాగానే ఉండేది  ఆంధ్ర పత్రిక ద్వారా ఆయన జర్నలిజం జీవితం ప్రారంభించి  1948 నుంచి 1960 వరకు ఉండి 1960లో సహసంపాదకుడిగా ఆంధ్రజ్యోతిలో కాలు పెట్టారు.
1960 నుంచి 1994 వరకు దాదాపు మూడున్నర దిశాబ్దాలు ఆయన ఆంధ్రజ్యోతి  లో రచన జైత్రయాత్ర  కొనసాగించారు ఆయన సంపాదక రచనా వైశిష్యం  పాఠకులలో ఎంతో ప్రభావాన్ని చూపేది  నార్ల గారు పత్రికకు దూరమైన తర్వాత 1985 లో నండూరి  ఆంధ్రజ్యోతి పత్రికకు సంపాదకుడిగా బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు  1978, 84, 92 లలో అమెరికాలోనూ 82 లో రష్యాలోనూ పర్యటించారు  వారి పుస్తకాలకు ఆదరణ తగ్గకపోవడం విశేషం  నండూరి ఖగోళ భౌతిక శాస్త్రాలను పరిశోధించి విశ్వరూపం  అనే పుస్తకాన్ని వ్రాశారు  మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం  తత్వ శాస్త్రాన్ని సులువుగా వివరించే విశ్వ దర్శనం ఆయన కలం నుంచి జాలువారినవే.



కామెంట్‌లు