అమ్మలకు అమ్మ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పాతకోవూరు తాలూకా మిలగల్లులో తన అమ్మమ్మగారింట  1892 జూన్ 10వ తేదీన కనకమ్మ గారు జన్మించారు. వీరి తాత పూణక మల్లారెడ్డి అమ్మమ్మ సుబ్బమ్మ గారు అన్యోన్య దంపతులు  వీడు ఆ ప్రాంతంలో నిత్యం అన్న ప్రసాద దాతలుగా ఖ్యాతిగాంచారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి గారు, తల్లి కవమ్మ గార్లు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ గ్రామస్తులకు ఆదర్శంగా ఉండేవారు  సంపన్న కుటుంబాలలో అతిథులకు చేసే మర్యాదలకంటే పుణక వారి ఇంటి ఆతిథ్యం భిన్నంగా ఉండేది  వీరి వెంట అతిథిలకు స్వయంగా  ఇంటి వారే స్వాగతం పలికే వారు అలాగే భోజనం వడ్డించేవారు వందేమాతరం సందర్భంగా నెల్లూరుకు వచ్చిన మహా  వక్త  బిపిన్ చంద్రపాల్ వీరి ఇంట రెండు రోజుల అతిథ్యాన్ని స్వీకరించారు. బిపిన్ చంద్రపాల్ కు ఇది ప్రత్యేకం రెండు రోజుల ఆయన గడపలేదు. తల్లిదండ్రులు ఏ ముహూర్తాన  కనకమ్మ అన్న పేరు పెట్టారి గానీ సార్ధక నామ ధేయురాలుగా బంగారు తల్లిగా అందరి చేత కొనియాడబడుతూ  జీవితం  ధన్యం చేసుకున్న  అదృష్టవంతురాలు  కనకమ్మ గారి భర్త సుబ్బరామిరెడ్డి గారు మేనత్త ఆదెమ్మ పొట్లపూడిలో శివాలయం కట్టించి  దాని పోషణకు విశేషంగా ఆస్తిపస్తులను ఏర్పాటు చేసింది  శివాలయం బ్రహ్మోత్సవాలు జరిగే ఐదు రోజులు భారీ ఎత్తున సంతర్పణ పుణకా వారి ఆధ్వర్యంలో సాగేది  నెల్లూరుకు  తూర్పుగా సముద్ర తీరానికి కొంచెం సమీపంలోని సంపన్న గ్రామం తోట్లపూడి  20వ శతాబ్దంలో వందేమాతరం తో ప్రారంభమైన పలు ఉద్యమాలకు ఈ గ్రామం కేంద్ర బిందువు అయింది  గ్రంథాలయ ఉద్యమం రూపుదిద్దుకోక ముందే ఆ గ్రామంలో గ్రంథాలయం  వెలిసింది. మహాత్మా గాంధీ రంగ ప్రవేశం చేయకముందే ఆ గ్రామంలో అస్పృశ్యతానివారణ కృషి ప్రారంభమైంది అలాగే ఎన్నో అభ్యుదయ కార్యక్రమాలకు  పోట్లపూడి పురిటి గడ్డ అయింది  నవ్య సాహితీకవులను దేశభక్తులను భాషా ప్రయుక్త రాష్ట్ర వాదులను విప్లవ రాజకీయ నాయకులను వక్త లను ఆ కాలంలో ఆకర్షించిన గ్రామం  దక్షిణ ఆంధ్రదేశంలో ఒక పోట్లపూడి గ్రామం మాత్రమేనని పేర్కొనవచ్చు  ఆ విప్లవాత్మక  మార్పులు అన్నిటి వెనక దృఢంగా నిలిచిన  వీర నారి కొనక కనకమ్మ గారు  ఆమెకు ఎంత ధైర్యం. ప్రతి అభ్యుదయ కార్యక్రమంలో ముందుకు రావడానికి కారణం  ఆమె కుటుంబ నేపథ్యం  ఆ కుటుంబం ఎప్పటినుంచో అభ్యుదయ ఫలితాలు నడిచింది  ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు కనకమ్మ గారు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం