గోరా గారి ఇంట్లో విద్యా వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గోరా గారు ఏదైనా ఒక విషయాన్ని పెద్దవాడికి చెబితే అతను రెండవ వాడికి అతను మూడవ వాడికి అలా చివరి వరకు వారి పాఠం వెళ్లేది వారికి తొమ్మిది మంది సంతానం దేశంలో ఒక్కొక సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్క బిడ్డ పుట్టినప్పుడు ఆ పేరు పెట్టారు ఉప్పు సత్యాగ్రహానికి లవణం మరొక అమ్మాయికి విద్య మరొక అతనికి నియంత విజయం సమరం మైత్రి అలాంటి పేర్లు పెట్టుకుంటూ వస్తున్న సందర్భంలో తొమ్మిదవ బిడ్డజన్మించినప్పుడు ఏ సంఘటన జరగలేదు కనుక తొమ్మిదవ పిల్ల అందువలన నౌ హిందీలో 9 అని అర్థం వస్తుంది జీవితంలో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అర్థం కూడా స్ఫురిస్తుంది. లయోలా కళాశాలలో గోరా గారి అబ్బాయినియంతను పి యు సి లో చేర్పించడానికి ఏర్పాటు చేసిన సందర్భంగా కళాశాల నిర్వాహకులు నియంత అన్న పేరు వల్ల అతనికి సీటు ఇవ్వలేదు అప్పుడు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు గోరా గారు ముఖ్యమంత్రి కి ఒక కార్డు రాసి నా కుమారునికి మంచి మార్కులు వచ్చిన పేరు వల్ల వారు చేర్చుకోవడం లేదు దీనికి పరిష్కారం మీరే చూపించాలి అని రాస్తే రెడ్డిగారు కళాశాల నిర్వాహకులకు తంతి ద్వారా నియంతను తక్షణం కళాశాలలో చేర్చుకోండి లేకుంటే మీ కళాశాల తీసివేస్తాను అని చెప్పడంతో నియంత కళాశాలలో చేరాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని చక్కగా పరిష్కరించడం ఎలాగో గోరా గారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియదు అంటే అది అతిశయోక్తి కాదు
మూఢనమ్మకాలను మూలాలతో సహా పెల్లగించాలి అన్న అభిప్రాయంతో ఒక ఉద్యమంగా గోరా గారి శ్రీమతి సరస్వతి గారు ఉదాహరణాత్మకంగా రుజువు చేస్తూ ముందు తాను ఆచరించి చూయించారు గ్రహణాలు పట్టినప్పుడు (సూర్యుడిగాని చంద్రుడు కానీ) గర్భిణీ స్త్రీలు బయట నిద్రించకూడదు పశువుల కొమ్ముకు సున్నం రాయాలి అని నమ్మేవారికి తాను గర్భిణిగా ఉన్నప్పుడు గ్రహణం రోజున బయటే నిద్రించి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎంత సలక్షణంగా ఉన్నదో చూయించిన వ్యక్తి సరస్వతి గారు అలా గోరా గారి కుటుంబం జాషువా గారి కుటుంబం సామాజిక ప్రయోజనం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారు వారిద్దరూ భౌతికంగా మనలను వీడి వెళ్లినా వారి ఆదర్శాలు మన మనసులో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
జనకవి జాషువ- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి