🔱సిద్ధి దాత్రివి నీవె!
కైవల్య దాయినివి!
నవ దుర్గా రూపిణి!
శ్రీమాతా శివాని!
( శ్రీమాత పదాలు.,)
🔱శ్రీమాత.. భక్తి ముక్తి ప్రదాయిని! సాధకులకు .. అణిమాది అష్ట సిద్ధులను అనుగ్రహించు జనని.. శ్రీదుర్గా భవాని! సిద్ధి అనగా మోక్షము. శ్రీమాత.. భక్త మహాశయులకు.. శ్రీకైవల్య పదమును; తనస్వరూపమగు ప్రకృతి ద్వారా ఘటింప చేయునది. కనుక, "సిద్ధిదాత్రి" అనిపేరు.
ఆదిపరాశక్తి అయిన జగదాంబ, దివ్యానుగ్రహము వలననే, పరమేశ్వరుడు.. సమస్త సిద్ధులను పొందు చున్నాడు; అని పురాణగాధ. పిమ్మట, శాంభవి.. మహా శంభునిలో అర్ధభాగమై నిలిచింది. ఆ విధముగా పార్వతీదేవి, పతిదేహము నందు.. ఎడమభాగము పరిగ్రహించిoది. కనుక, "సామి సామేని చేకొన్న చాన" అని అచ్చ తెలుగు పదము!
🔱"నవమం సిద్ధి దాత్రీ చ" అనే పురాణోక్తి ప్రకారం; తొమ్మిది దుర్గా దేవీ మూర్తులలో తొమ్మిదవది .. "సిద్ధి దాత్రి దుర్గ"!
🪷ఓం శ్రీదుర్గ! జయ శ్రీదుర్గ! జయజయ శ్రీదుర్గ!
( శ్రీదుర్గాదేవి షోడశ (16) నామ మాలిక.,)
🚩 మత్తేభ వృత్తం
నవరాత్రమ్ముల గొల్చి వేడుదును విన్నాణమ్ము గూర్చంగ సం
స్తవముల్ జేయుచు సిద్ధిధాత్రి జననిన్ సంతుష్టితో గాంచగా
భవురాణిన్ భువి దుష్టసంతతిని నొప్పన్ గాంచగా నెంచి సం
భవమైనట్టి విధమ్ములన్ పొరిగొనన్ ప్రార్థించు చుందున్ సదా!
(👌పొరిగొను = సంహరిచు, నశింప జేయు చేయు )
[ డా. రఘుపతి శాస్త్రుల., ]
🔆🪷🔆
🚩తేట గీతి పద్యము
సిద్ధ గంధర్వ యక్షులు, సేవ చేయ
అణిమ మొదలగు, సిద్ధుల నందజేయ
శివుని యర్ధాంగివై, దరి జేరు సదయ!
సిద్ధిధాత్రివై మమ్ము రక్షింపుము దయ!
[ అవధాని, కోట రాజశేఖర్., ]
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి