వాల్మీకి కవికోకిల; "కవి మిత్ర" శంకర ప్రియ., శీల.,-సంచార వాణి: 99127 67098
 ⚜️వాల్మీకి "కవి కోకిల"
     మధురంగా కీర్తించింది!
     కవితా శాఖలపైన
          ఓ సుమతీ! ఓజోవతి!
⚜️కవన వనమునందు
      గాంభీర్యంగా గర్జించింది!
     వాల్మీకి "కవి సింహము"
         ఓ సుమతీ! ఓజోవతి!
 🔆 వాల్మీకియనెడు. కోకిల..కవితా శాఖలనెక్కి రామ కథను, యింపుగా గానము చేస్తున్నది! అట్లే, "వాల్మీకి యనెడి సింహము" కవిత్వమనెడి వనములో.. సంచరించు చున్నది. ఆ మృగరాజు.. రామ కథను గర్జించు చున్నది. ఆ నాదమును వినని వాడెవడు ప్రగతిని (కైవల్య పదమును) పొంద లేకున్నాడు
👌ఆది కవివాల్మీకి మహర్షిని కోకిలతోను, సింహముతోను పోల్చారు! కోకిలస్వరము... మాధుర్యమునకు; సింహస్వరము గాంభీర్యమునకు ... ప్రఖ్యాతి గాంచినవి!
   🔆ధ్యాన శ్లోకములు:-
కూజంతం రామ రామేతి
 మధురం మధురాక్షరం!
ఆరుహ్య కవితా శాఖామ్
 వందే వాల్మీకి కోకిలమ్!
       (2)
వాల్మీకేర్ముని సింహశ్చ
 కవితా వనచారిణ:
శ్రుణ్వన్ రామకథా నాదం
 కో న యాతి పరాంగతిం
 👌ఆది కవి, వాల్మీకి మహర్షి.. మన ఇతిహాసములలో.. మొదటిదైన రామాయణమును రచించారు! ఇందులో... 
శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుడు, మరియు హనుమంతుని... దివ్యలీలా గాథలను పేర్కొనుచున్నారు! అదే విధంగా.. శ్రీమద్రామాయణము.. మన సనాతధర్మం ఘనతను; జగతికి చాటిచెప్పింది! అందువలన, వాల్మీకి మహర్షి జయంతిని , ఘనంగా జరుపుకొను చున్నాము!
     చాంద్రమానం ప్రకారం, వాల్మీకి జయంతి.. ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి నాడు వస్తుంది. కనుక,."ప్రగతి దివస్" అని పేరు! ఆనాటి నుండి... శోభాయాత్రలను ప్రారంభించు చున్నాము!
 🙏సీస పద్యము
    రామాయణమ్మును ప్రప్రథమమ్ముగా
 సంస్కృతమ్మున వ్రాసి జగతి వెలిగె
    రామరాజ్యమును శ్రీరామచంద్రుని గని 
 నుడువగ సమకాలికుడుగ మెలగె 
    "రామ" యనుమన, "మరా" మరా యని, తప 
 మొనరించి ఋషివర్యు డనగ జెలగె
    రామాయణమ్మును లవకుశులకు నేర్పి 
 రామనామ జపానురక్తిఁ బరగె
      🙏తే.గీ. 
   పఠన గానానుగుణ కావ్యఫణితిఁ గూర్చె 
విశ్వమున రామమహిమను విశదపరచె 
   అట్టి ప్రాచేతసుని మనసారఁ దలతు
 ఆదికవియగు వాల్మీకి కంజలించి.
[ రచన:- అవధాని, కోట రాజశేఖర్., శ్రీ సీతారామ కళ్యాణం., ]
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం