హరిత విప్లవపితామహునికి అక్షర నివాళి;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం9963265762.
 తిండికలిగితే కండకలదోయ్
కండ కలవాడే మనిషోయ్ అన్న
మహాకవి గురజాడ చెప్పినట్లు
దేశంలో ప్రజలు ఆహార సమస్యతో భాధపడకూడదని
బాల్యంలోనే బెంగాల్ కరువును చూసి
వైద్య విద్యను వదలి వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత నిచ్చి
జీవితమంతా వ్యవసాయ పరిశోధనకు
ప్రజల ఆకలిమంటలను తీర్చుటకై
కృషిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ 
మూర్తీభవించిన మానవతకు ప్రతీక...!!
వ్యవసాయ దిగుబడే ధ్యేయంగా
అత్యున్నత ఐ.పి.ఎస్ ను తృణప్రాయంగా త్యజించి
నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్ డి చేసి
మాతృభూమి సేవకే జీవితపర్యంతం కృషిచేసి
అధిక దిగుబడి వంగడాలను సృష్టించిన
కృషీవలుడు స్వామినాథన్....!!
ప్రపంచ మొదటి ఆహార పురస్కారాన్ని అందుకున్న
వ్యక్తిగా
పురస్కారం ధనంతో పరిశోధన కేంద్రాన్ని 
చెన్నై లో నెలకొల్పి ఎందరికో ప్రేరణానిచ్చిన
మీరు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగాసేసే ,ఇందిరాగాంధీ వంటి ఎన్నో పురస్కారాలకే వన్నెతెచ్చిన భరతమాత ముద్దుబిడ్డ.
అనేక పదవులలో పరిశోధన కేంద్రాలలో
డైరెక్టర్ గా సలహాదారుగా ఉండి ఎనలేని సేవచేసిన
హరితవిప్లవ పితామహా
శతమానం భవతిగా జీవించిన
మీకివే  నా అక్షర నివాళి...!!
..........................

...........................

కామెంట్‌లు