సుప్రభాత కవిత ; -బృంద
చీకటెంత  చిక్కనైనా
రాతిరెంత భారమైనా
గుండెకెంత గాయమైనా
వెలుగు వచ్చు ఖాయంగా!

నిస్సహాయత నిలబెట్టినా
నిందలెన్ని మీదపడినా
నిజమైన నిజాయితికి
గెలుపు వచ్చు ఖాయంగా!

ఉలి దెబ్బలు బాధిస్తే
శిల శిల్పమయ్యేనా?
తలవంచని ధైర్యానికి
ఇల విజయం ఖాయంగా!

వేకువ  వెలిగిన  తూరుపు
నింగిని నిండిన ఎరుపు
కళ్ళను  మెరిసే మెరుపు
తెచ్చును గెలుపు ఖాయంగా!

మంచి చెడ్డలు కల్ల నిజములు
ఎంచి చూసిన మనసులు
తుంచి తీరును ఇడుములు
మంచైపోవు మంటలు ఖాయంగా!

ఎద నిండే పండుగలా
వ్యధ తీరే సూచికలా
సుధ తీర్చే దాహంలా
కథ మార్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు