సుప్రభాత కవిత - బృంద
ఆవలి తీరాన అల్లంత దూరాన
అదిగదిగో.....వేయిరేకుల వెలుగుపువ్వు..

నింగిని సాగే నీలిమబ్బులు
నేలపై కొండల కోనల కురిపించే
సిరివాన జల్లులు

వెలుగులలో వానధారల తడిసిన పచ్చని చీరను పరవశంగా సర్దుకుంటున్న ప్రకృతి

నింగి పంపిన ప్రేమ సందేశాన్ని
పవిత్రంగా పరవశంగా 
దోసిలొగ్గి పట్టుకుంది పృధ్వి

కిరణాల రాయబారం ఫలించి
కురిసిన మబ్బుల వలపుకు
మురిసిన ముద్దుల పుడమి

వెచ్చని వెలుగుల్లో విచ్చిన
ముచ్చటైన మల్లెపువ్వులా
సొగసుగా పరిమళించె ధరణి

రాగసుధా వాహినిలో ఓలలాడు నేలను కని వెలుగుల దీవెనలిస్తూ
ఏతెంచు లోకబాంధవునికి

ఎద పొంగి పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు