నిర్ణయిస్తారు!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం
నిపుణులు
నిన్ను నీవు తక్కువ చేసుకోకు
అని అన్నారని
నన్ను నేను
ప్రతిభావంతునని
అసాధారణ వ్యక్తినని
అనుకున్నాను.!!!
కానీ

నిపుణులు మళ్లీ
అలా అనుకున్నావంటే
నీవు ఎప్పటికీ
ప్రతిభావంతుడివి
అసాధారణ వ్యక్తి వి
కాలేవు అని అంటున్నారు.!!?

నన్ను నేను
ఏమీ అనుకోకూడదు అని
వాళ్లే
నన్ను నిర్ణయిస్తారని
వాళ్లే
నన్ను గెలిపిస్తారు ఓడిస్తారని
తెలిసింది!!!!

కామెంట్‌లు