సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -277
శాఖా చంక్రమణ న్యాయము
*****
శాఖా అంటే చెట్టు యొక్క కొమ్మ.చంక్రమణము అంటే తిరగుట,పోవుట, వెడలుట,నడచుట అనే అర్థాలున్నాయి.
 కొద్ది సేపు కూడా కుదురుగా ఉండకుండా శాఖా చంక్రమణం చేసేదెవరంటే టక్కున మనకు  కోతి గుర్తుకు వస్తుంది. కోతి ఎక్కడా ఓ చోట కుదురుగా ఉండదు. కొమ్మల మీద నుండి అలా అలా దూకుతూ, పాకుతూ ,వేలాడబడుతూ వుంటుంది కదా!.
మరి మన పెద్దలు దీనిని ఎందుకు న్యాయంగా చెప్పారో నిశితంగా ఆలోచిస్తే ,ఇది ఖచ్చితంగా మానవులకు అన్వయించి చెప్పిందేనని అర్థం చేసుకోవచ్చు.ఎందుకో కారణాలు చూద్దాం.
మనకు ఇలాంటి సందర్భాలు ముఖ్యంగా  సభలు, సమావేశాల్లో మాట్లాడే  వక్తల్లో,కవులు రచయితల రచనలలో కనబడుతూ ఉంటాయి.
కొంతమంది వక్తలు తాము ప్రసంగించే ఉపన్యాసాల్లో అసలు విషయం మాట్లాడకుండా ఇతర అంశాల గురించి మాట్లాడుతూ వుంటారు.అలా విషయ స్ఫష్టత లేని ఆ వక్తల ప్రసంగాలు శ్రోతలను అయోమయానికి గురి చేస్తాయి.
అలాగే కొందరు రచయితల కవుల రచనల్లో కూడా ఇలాంటివి కనిపిస్తూ పాఠకులను సందిగ్ధంలో పడేస్తుంటాయి.
అయితే ఆచార్యులు, గురువులు తమ శిష్యులకు అందించే సమాచారంలో కొంత శాఖా చంక్రమణం యిమిడి వుంటుంది. ఎందుకంటే విద్యార్థులకు ఒక విషయాన్ని గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించాలంటే  వాటికి సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించిన అంశాలను, మూలాలను గురించి కూడా  వివరించాల్సిన అవసరం వుంటుంది.
ఉదాహరణకు గురుశిష్య సంబంధం గురించి విశ్వామిత్రుడు,శ్రీరాముడు గురించి చెప్పేటప్పుడు అసలు విశ్వామిత్రుడు శ్రీరాముడికి గురువు ఎలా అయ్యారు? ఆ విషయానికి సంబంధించిన పూర్వాపరాలు వివరించాల్సిందే.

రో ఉదాహరణ రామాయణాన్ని మూడు ముక్కల్లో "కట్టె కొట్టె తెచ్చే " అని  ముప్పై మాటల్లో చాలా క్లుప్తంగా చెప్పొచ్చు.  అలాగే మూడు వందల పేజీలకు మించిన సమాచారంతో సమగ్రంగా కూడా చెప్పవచ్చు.అయితే సమయం, సందర్భాన్ని గమనంలో పెట్టుకోవాల్సి వుంటుంది.
ఇచ్చిన సమయాన్ని, అంశాన్ని సద్వినియోగం చేసుకోవడం మరిచి శాఖా చంక్రమణం చేస్తే  శ్రోతలు, ప్రేక్షకుల,పాఠకుల అభిమానానికి దూరమయ్యే ప్రమాదం వుంటుంది.
 ఇదండీ! "శాఖా చంక్రమణ న్యాయము" అంటే.దీనిని సదా మాటల్లో ,చేతల్లో, రాతల్లో గమనంలో పెట్టుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం