స్వాగతం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నా జీవితంలోకి
నీకు సాదర స్వాగతం!
ఉగాదులు, ఉషస్సులు లేక
కటికచీకటి మరుగైన
నా అంతరంగంలోకి
దీపకళికలా వచ్చావు!
అనంతాకాశాన
మిలమిలలాడే నక్షత్రంలా
నా జీవితాకాశంలోకి
దూసుకువచ్చావు!
ఆకులురాలి, శాఖలుమోడై
ఎండిన ఈ జీవనవృక్షం
నీ రాకతో
వాసంత సమీరాలలో ఓలలాడింది!
నిబిడాంధకారమైన ఈ చిన్ని గుండెలో
నీ చిరునవ్వు సంధ్యారాగం పలికింది!!
*********************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
చాలా బాగుంది చిట్టి కవిత అభినందనలు సార్ 🌹🌹🙏