మిసైల్ సిటీ బాలాసోర్! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఒకప్పుడు బాలాసోర్ పశ్చిమ బెంగాల్ లో ఓప్రాంతం.కానీ1828లో ఒడిషాలో భాగమైంది.నిజానికి ఆప్రాంతం అసలుపేరు బనేశ్వర్.దానవరాజుబనేశ్వర్ రాజధాని పురాణగాథ ప్రకారం 
వామనుడు బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగులు కోరాడు.ఒక అడుగు ఆకాశం రెండోది భూమి పై వేశాడు.బలి జలానికి అధిపతి వరుణుని ప్రార్ధిస్తాడు.వరుణుడు సముద్రం దగ్గర చిన్న భూభాగంని ఇస్తాడు.అదంతా ఇసుక తో నిండి పోయింది.అదే బాలేశ్వర్ గా పిల్వబడింది.అలా బాలాసోర్ అనే ఇంకో పేరు కూడా వచ్చింది.ఇది చాలా అందమైన ప్రాంతం.శివాలయాలు చాలా ఉన్నాయి.తమలపాకు కొబ్బరి ముఖ్యమైన పంటలు.చరిత్రప్రసిద్ధ ప్రాంతాలు కాక రాకెట్ లాంచింగ్ సైట్ చాందీపుర్ బాలాసోర్ ప్రాంతం లో ఉంది.మిసైల్స్ ప్రయోగం పరీక్షలు ఇక్కడ జరుగుతాయి.పృథ్వి అగ్ని త్రిశూల్ ఇక్కడే ప్రయోగించబడినాయి🌹
కామెంట్‌లు