*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *శతరుద్ర సంహిత --(0292)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

వరాహకల్పము - 9 శివ అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 
*బ్రహ్మ దేవా! వైస్వత మనువు పుత్రుడు, నీ ప్రపౌత్రుడు అయిన కల్పేశ్వరుడు, వరాహకల్పమున తొమ్మిదవ మన్వంతరంలో అన్నిలోకాలను ప్రకాశింప చేస్తున్నాడు. అప్పుడు ప్రతి మన్వంతరమున, నాలుగు యుగాలలో ఏదో ఒక ద్వాపరమున భక్తులను రక్షించడానికి, బ్రాహ్మణులకు మేలు చేయడానికి నేను అవతరిస్తూ ఉంటాను.*

*మొదటి చతుర్యుగ ప్రథమ ద్వాపరంలో  "ప్రభువే - వ్యాసుడు". పార్వతీ దేవితో కూడి, బ్రాహ్మణ హితార్థమై, "శ్వేతుడి"గా అవతరిస్తాను. అప్పుడు నాకు, హిమాలయమున, ఛాగల్ అను చోట నా శిఖను ధరించిన, శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాశ్వుడు, శ్వేతలోహితుడు అనే పెర్లు గల నలుగురు శిష్యలు వుంటారు. వారు ధ్యాన యోగముతో నన్ను ఆశ్రయించి, నన్ను "తత్త్వతః" అని తెలుసుకుని, జరామరణ రహితులై, పరబ్రహ్మ సమాధి పొంది, నన్ను చేరుకుంటారు. అప్పుడు మానవులు నన్ను చేరడానికి నా "ధ్యానము" ఒక్కటే మార్గము.*

*మొదటి చతుర్యుగ రెండవ ద్వాపరంలో "సత్యప్రజాపతి - వ్యాసుడు". అప్పుడు, "సుతారుడు" అనే పేరుతో నేను అవతరిస్తాను. నాకు, దుందుభి, శతరూప, హషీక, కౌతుమాన్ అను పేర్లుగల నలుగురు, దేవాదులగు బ్రాహ్మలు శిష్యులుగా ఉంటారు. ధ్యానయోగ బలముతో నన్ను "తత్త్వతః" అని తెలుసుకుని, నా నగరమైన కైలాసానికి చేరుతారు.

*మొదటి చతుర్యుగ మూడవ ద్వాపరంలో "భార్గవుడు - వ్యాసుడు". అప్పుడు, "దమనుడు" అనే పేరుతో నేను ప్రకటితము అవుతాను. దమనుడుగా అవతరించిన నాకు, విశోకుడు, విశేషుడు, విపాపుడు, పానాశనుడు అని పిలవబడే నలుగురు శిష్యులు, పుత్రులుగా ఉంటారు. వీరిని వెంట బెట్టుకుని, భార్గవ వ్యాసునికి, నివృత్తి మార్గాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంటాను.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు