*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *శతరుద్ర సంహిత --(0293)*

 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

వరాహకల్పము - 9 శివ అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ నాల్గవ ద్వాపరంలో "అంగిరుడు - వ్యాసుడు".  నేను "సుహోత్రుడు" గా అవతరిస్తాను. యోగసాధకులు, మహాత్ములు అయిన నలుగురు సుముఖడు, దుర్ముఖుడు, దుర్దముడు, దురతిక్రముడు అని పిలవబడే శిష్య కుమారులు ఉంటారు. వీరితో కూడి, నేను అంగిరస వ్యాసునికి సహాయకుడిగా ఉంటాను.*

*మొదటి చతుర్యుగ ఐదవ ద్వాపరంలో "సవితుడు - వ్యాసుడు". అప్పుడు నేను "కంకుడు" అనే మహాతపస్వి రూపంలో ఉంటాను. ఈ అవతారంలో కూడా నాకు, సనకుడు, సనాతనుడు, సునందనుడు, నిర్మలుడు అని పిలవబడే, యోగసాధకులు, మహాత్మలు అయిన నలుగురు కుమారులు ఉంటారు. కంకుడుగా పిలవబడుతున్న నేను, నివృత్తి మార్గమును వ్యాపింపచేసేందుకు, సవితవ్యాసునికి సహాయపడతాను.*

*మొదటి చతుర్యుగ ఆరవ ద్వాపరంలో "మృత్యువే - వ్యాసుడు". ఈ వ్యాసుడు లోకాలకు మంచి చేకూర్చే వాడుగా ఉంటాడు. అప్పుడు నేను "లోకాక్షి" అని పిలవబడే అవతారం దాలుస్తాను. నివృత్తి మార్గాన్ని లోకంలో వ్యాపింప చేయడంలో, వ్యాసునికి సహాయకుడిగా ఉంటాను. ఈ "లోకాక్షి" అవతారంలో కూడా, సుధాముడు, విరజుడు, సంజయడు, విజయుడు అని పిలవబడే నా కుమారులు, నివృత్తి మార్గాన్ని బోధిస్తూ, ఆచరిస్తూ నా నగరానికి చేరుకుంటారు.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss
కామెంట్‌లు