శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....
వరాహకల్పము - శివుని యక్క 10 నుండి 18 యోగేశ్వర అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*
*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:*
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ పదమూడవ ద్వాపరంలో గంధమాదన పర్వతము పైన ఉన్న వాలిఖ్య ఆశ్రమములో "బలి" రూఒములో అవతరిస్తాను. ఈ "బలి" అవతారములో నాకు, సుధాముడు, కశ్యపుడు, వశిష్ఠుడు, విరజుడు అని పిలవబడే నలుగురు యోగ విద్యోపాసకులు కుమారులుగా ఉంటారు.*
*మొదటి చతుర్యుగ పదునాల్గవ ద్వాపరంలో వ్యాసుడు "రక్ష" అనే పేరుతో పిలువ బడతాడు. అంగిరా వంశములో "గౌతముడు" గా నేను అవతరిస్తాను. ఈ కలియుగములో, అత్రి, వశదుడు, శ్రవణుడు, శ్నవిష్కటుడు అను నలుగురు కొడుకులు ఉంన్నారు.*
*మొదటి చతుర్యుగ పదిహేనవ ద్వాపరంలో వ్యాసుని పేరు, "త్రయ్యారుణి". హిమ్మాలయములకు వెనుక వైపున "వేదశీర్షము" అనే పర్వతరాజము ఉంది. అక్కడ సరస్వతీ నదికి ఉత్తర తీరంలో "వేదశిరుడు" గా నేను అవతరిస్తాను. ఈ అవతారములో నాకు, వేదశిరమే అస్త్రంగా ఉంటుంది. కుణి, కుణిబాహు, కుశరీరుడు, కునేత్రకుడు అనే నలుగురు కుమారులు ఉంటారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి