*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* - *శతరుద్ర సంహిత --(0297)*
 శౌనకాది మునులు, సూత మహర్షి సంవాదంలో.....

వరాహకల్పము -  శివుని యక్క 10 నుండి 18 యోగేశ్వర అవతారముల వర్ణన........ రుద్రని చేత చెప్పబడిన శంకరుని చరిత్ర.....

*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*

*నందీశ్వర, సనత్కుమార సంభాషణం :*

*రుద్రుడు చెపుతున్నారు, అని నందీశ్వరుడు (నం.) చెపుతున్నారు:* 
*బ్రహ్మ దేవా! మొదటి చతుర్యుగ పందొమ్మిదవ ద్వాపరంలో వ్యాసుని పేరు "భరద్వాజుడు". హిమాలయములలో నేను "మాలి" అనే పేరుతో అవతరిస్తాను. నా తలమీద పొడుగాటి జడలతో జుత్తు ఉంటుంది. నాకు, సముద్రము వంటి గంభీర స్వభావము గల హిరణ్యనాముడు, కౌసల్యుడు, లోకాక్షి, ప్రధిమి అనే నులుగురు కుమారులు ఉంటారు.*

*మొదటి చతుర్యుగ ఇరువదవ ద్వాపరంలో వ్యాసుని పేరు "గౌతముడు". హిమాలయములలో ముందు వైపున అట్టహాస అనే పర్వతశిఖరము ఉంది. ఈ అట్టహాస పర్వత శిఖరము ఎల్లప్పుడూ దేవతలతో, యక్షులతో, యోగులతో, సిద్ధ చారుణులతో, మనుష్యులతో నిండి ఉంటుంది. ఈ అట్టహాస పర్వతము మీద, నేను "అట్టహాసుడు" అనే పేరుతో అవతరిస్తాను. ఈ గౌతమవ్యాసుని ద్వాపరంలో, మనుషులు అందరూ నా "అట్టహాస" రూపముపై అమితమైన ప్రేమ అభిమానములు కలిగి ఉంటారు. సుమంత, వర్వరి, విద్వాన్ కబంధ, కునికంధర అనే నలుగురు కుమారులు నాకు ఉంటారు.*

*మొదటి చతుర్యుగ ఇరవై ఒకటవ ద్వాపరంలో వ్యాసుని పేరు "వాచశ్రవుడు". ఈ ద్వాపరంలో నేను "దారకుడు" అనే పేరుతో అవతరిస్తాను. నేను అవతరించిన ప్రదేశము "దారువనము" అని పిలువబడుతుంది. ఈ వాచశ్రవవ్యాస ద్వాపరంలో నాకు, ప్లక్ష, దార్భాయణి, కేతుమంతుడు, గౌతముడు అను నలుగురు కుమారులు ఉంటారు.*

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ


Nagarajakumar.mvss

కామెంట్‌లు